గ్యాస్ లీకై 12 మంది మృత్యువాత.. 13 మందికి తీవ్ర గాయాలు..
పాకిస్తాన్‌లోని భారీ పేలుడు సంభవించింది. కరాచీలో షేర్ షా ప్రాంతంలో గ్యాస్ లీకయ్యింది. ఇక్కడ సిలిండర్లు నాసిరకం వాడుతారట. వంటకు/ కార్లకు ఉపయోగించేవి స్టాండర్ట్ ఉండవట. పేలుడుతో ఓ ప్రైవేటు బ్యాంకు భవనం భారీగా ధ్వంసమైంది. ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందగా, 13 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో ధ్వంసమైన భవన శిథిలాల కింద పలువురు చిక్కుకోగా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

పేలుడు..
పేలుడు ధాటికి చుట్ట పక్కల భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. పరచా చౌక్ ఏరియాలో ఘటన జరిగింది. గాయపడ్డ వారిలో.కొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఇక్కడ గ్యాస్ పైపులైన్ వెళుతుందని..అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో భవనానికి భారీ నష్టం వాటిల్లిందని పోలీసులు వెల్లడిస్తున్నారు.

ఎంతమంది ఉన్నారు..?
రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవన శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా ? అనేది తెలియరావడం లేదు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. శిథిలాలను తొలగించి..చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాంబు డిస్పోజల్ యూనిట్ చేరుకుని.. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. భవనంలో బ్యాంకు ఉందని, త్వరలో కొత్త ప్రాంతానికి తరలించనున్నారని అంతలో పేలుడు ఘటన జరగడం దురదృష్టకరం అని అధికారులు అంటున్నారు.

సహాయక చర్యలు
పేలుడుపై సీఎం సింధ్ మురాద్ ఆలీ షా స్పందించారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశించారు. పేలుడులో ప్రాణనష్టం సంభవించడంపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విధంగా చూడాలని ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

వాహనాలు కూడా
పేలుడు ఘటనతో ఆ సమీపంలో పార్కింగ్ చేసిన టూవీలర్, కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీలో ఆ భవనం రెండు అంతస్తులు ఉందని తెలుస్తోంది. కిటికీలు, తలుపులు విసిరేసినట్టు కనిపించాయి. పత్రాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ వల్ల పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో నాసిరకం సిలిండర్లను వంటకు/ వాహనాలకు ఉపయోగించడం సర్వ సాధారణమేనట.












Click it and Unblock the Notifications