కరాచీలో భారీ పేలుడు- భీతావహం

Karachi Airport blast: పొరుగుదేశం పాకిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు చైనా దేశస్థులు ఉన్నారు. 17 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పేలుడు వెనుక గల కారణాలు ఏమిటనేది వెంటనే తెలియరాలేదు. దీనిపై జాతీయ భద్రత అధికారులు, పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. విద్రోహ శక్తులే ఈ పేలుడు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటన తరువాత కరాచీలో హైఅలర్ట్ ప్రకటించారు.

3 including 2 Chinese died in an explosion near Karachi Jinnah International Airport Pakistan

కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆదివారం రాత్రి ఈ పేలుడు సంభవించింది. ఎయిర్‌పోర్ట్ పార్కింగ్‌కు కొద్దిదూరంలో నిలిపివుంచిన ఓ ట్యాంకర్‌ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చైనీయులతో పాటు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 17 మంది గాయపడ్డారు.

కీలో మీటర్ దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది. జిన్నా ఎయిర్‌పోర్ట్‌కు దూరంగా ఉండే నార్త్ నజీమాబాద్, చుంద్రీగర్ రోడ్, కరీమాబాద్ వంటి ప్రాంతాల వరకు శబ్దం వినిపించినట్లు డాన్ న్యూస్ తెలిపింది. దాని తీవ్రతకు పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. గాల్లోకి ఎగిరిపడ్డాయి. పూర్తిగా కాలిపోయాయి.

అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో సంఘటన స్థలం మొత్తం భీతావహంగా కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజీకి తరలించారు.

3 including 2 Chinese died in an explosion near Karachi Jinnah International Airport Pakistan

పేలుడుకు గల కారణాలు ఇప్పటికిప్పుడు తెలియరావట్లేదని సీఐడీ డైరెక్టర్ జనరల్ ఆసిఫ్ ఇజాజ్ షేక్ తెలిపారు. దీనిపై ఆరా తీస్తోన్నామని చెప్పారు. ఇది సహజ పేలుడు కాదని, దీని వెనుక కుట్ర కోణం ఉండొచ్చని పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు సింధ్ గవర్నర్ కమ్రన్ ఖాన్ తెజోరీ చెప్పారు.

సింధ్ హోం మంత్రి జియావుల్ హసన్ లాంజర్ ఈ ఘటనపై స్పందించారు. ఈ పేలుడు కోసం ఐఈడీ ఉపయోగించినట్లు వెల్లడించారు. ట్యాంకర్‌లో ఐఈడీని అమర్చి పేలుడుకు పాల్పడ్డారని తెలిపారు. దీనికి కారణం ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నామని చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

కాగా- ఈ దాడికి తామే కారణం అంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వెల్లడించింది. ఈ మేరకు అక్కడి మీడియా హౌస్‌లకు ఓ ఇ-మెయిల్‌ అందినట్లు పాకిస్తాన్ జియో న్యూస్ తెలిపింది. చైనాయులను లక్ష్యంగా చేసుకుని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండొచ్చని వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+