పడవ ప్రమాదంలో 90 మంది మృతి..మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే..
ఆఫ్రికా దేశంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 90 మంది అక్కడిక్కడే జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదం మోజాంబిక్ ఉత్తర తీరంలో జరిగినట్లు తెలుస్తోంది. నాంపులా ప్రావిన్స్‌లోని ఓ ద్వీపానికి బయలుదేరింది ఓ ఫెర్రీ. అయితే, అప్పటికే ఆ పడవ ఓవర్ లోడ్‌తో వెళ్తుంది. దీంతో ఉన్నట్టుండి పడవ మోజాంబిక్ ఉత్తర తీరంలో ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలున్నట్లు అధికారులు వెల్లడించారు.
నాంపులా ప్రావిన్స్ లోని ఓ ద్వీపానికి పడవ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాద సమయంలో ఫెర్రీలో మొత్తం 130 మంది ఉన్నట్లు సమాచారం. ఈ పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం సంబంవించిందని అక్కడి అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు హుటాహుటిన అక్కడికి చేరి సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయినవారిలో అధిక సంఖ్యలో చిన్నారులే ఉన్నట్లు అధికారులు వివరించారు. అయితే, ఈ ఘోర ప్రమాదంపై మరో వదంతు కూడా వినిపిస్తోంది. కలరా వ్యాప్తి అంటూ వదంతులు రావడంతో ప్రజలు భయభ్రాంతులకి గురయ్యారని, దీన్ని నుంచి తప్పించుకునే క్రమంలో దీవుల్లోకి వెళ్తున్నట్లు నాంపుల ప్రావిన్స్ సెకట్రీ జైమ్ నెటో తెలిపారు. ఈ క్రమంలోనే పడవ ప్రమాదానికి గురయి ఉంటుందని అంటున్నారు.

మొజాంబిక్‌లో ఇప్పటివరకూ 15వేల కలరా కేసులు...
మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే కలరా వ్యాప్తి అంటూ వదంతులు రావడంతో ప్రజలు తప్పించుకుని దీవులోకి వెళ్తున్నట్లు నాంపుల ప్రావిన్స్ సెకట్రీ జైమ్ నెటో వెల్లడించారు. ఇలా వెళ్తుండగా పదబ మునిగిందంటున్నారు. అయితే, ఇక్కడ చాలామంది ప్రజలు కలరా వ్యాధి గురయి ప్రాణాలు విడిచినట్లు సమాచారం. 2023 అక్టోబర్ నెల నుంచి ఇప్పటివరకు మొజాంబిక్‌లో మొత్తం పదిహేను వేల కలరా కేసులు నమోదైనట్లు అధికారిక గణంకాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications