Plane Crash: జింబాబ్వేలో విమాన ప్రమాదం.. ప్రముఖ వ్యాపారవేత్త మృతి..
జింబాబ్వేలో ఘోర ప్రమాదం జరిగింది. విమానం కుప్పకూలిన ఘటనలో భారత సంతతికి చెందిన వ్యాపారితో పాటు అతని కొడుకు కూడా మరణించాడు. రియోజిమ్, బంగారం, బొగ్గును అలాగే నికెల్, రాగిని శుద్ధి చేసే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ యజమాని హర్పాల్ రంధావా, అతని కొడుకుతో పాటు మరో నలుగురు ఐహరారేలోని జ్వామహండే ప్రాంతంలో విమానం కూలిపోవడంతో మరణించారు.
నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వారి ప్రైవేట్ విమానం కూలిపోవడంతో మరణించిన ఆరుగురు వ్యక్తులలో భారతీయ బిలియనీర్ , అతని కుమారుడు ఉన్నారు మీడియా నివేదికలు వస్తున్నాయి. రియోజిమ్, బంగారం, బొగ్గును అలాగే నికెల్ మరియు రాగిని శుద్ధి చేసే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ యజమాని హర్పాల్ రంధావా, అతని కొడుకుతో పాటు మరో నలుగురు మషావా, ఐహరారేలోని జ్వామహండే ప్రాంతంలో విమానం కూలిపోవడంతో మరణించారని జింబాబ్వేలోని ఓ వెబ్‌సైట్ పేర్కొంది.

రియోజిమ్‌కు చెందిన సెస్నా 206 విమానం హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. రియోజిమ్‌కు చెందిన మురోవా డైమండ్స్ గని సమీపంలో సింగిల్-ఇంజిన్ విమానం కూలిపోయింది. జ్వామహండే ప్రాంతంలోని పీటర్ ఫామ్‌లోకి వెళ్లే ముందు విమానం సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంది. బహుశా గాలి మధ్యలో పేలుడు సంభవించి ఉండవచ్చు. ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ ప్రాణాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది.
బాధితుల్లో నలుగురు విదేశీయులు కాగా, మిగిలిన ఇద్దరు జింబాబ్వే వాసులు ఉన్నారని పోలీసులను ఉటంకిస్తూ ప్రభుత్వ యాజమాన్యంలోని దినపత్రిక హెరాల్డ్ పేర్కొంది. "జింబాబ్వే రిపబ్లిక్ పోలీసులు సెప్టెంబర్ 29న ఉదయం 7:30 నుండి 8 గంటల మధ్య జరిగిన విమాన ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు నిర్ధారించారు" అని పోలీసులు తెలిపారు. "మురోవా డైమండ్ కంపెనీ (రియోజిమ్) యాజమాన్యంలోని తెలుపు, ఎరుపు Zcam విమానం ఉదయం 6 గంటలకు హరారే నుండి గని కోసం బయలుదేరింది మరియు మషావా నుండి 6 కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది."












Click it and Unblock the Notifications