Submarine: టైటానిక్ శిథిలాలను చూడడానికి తీసుకెళ్లే జలాంతర్గామి సిబ్బందితో సహా గల్లంతు..
అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిథిలాలను చూడటానికి ప్రజలను తీసుకెళ్లడానికి ఉపయోగించే చిన్న జలాంతర్గామి దాని సిబ్బందితో కలిసి అదృశ్యమైనట్లు BBC నివేదించింది. సముద్రంలో సబ్‌మెర్‌సిబుల్ ఎక్కడ తప్పిపోయిందనే విషయంపై కూడా స్పష్టత లేదు.
సబ్‌మెర్సిబుల్ ఒకేసారి ఐదుగురు వ్యక్తులను మోసుకెళ్లగలదు. టైటానిక్ శిథిలాల వరకు పూర్తి డైవ్ చేయడానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది. సబ్‌మెర్సిబుల్‌ను గుర్తించేందుకు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని నివేదిక పేర్కొంది. సబ్‌మెర్సిబుల్ ఓషన్ గేట్ ఎక్స్‌పెడిషన్స్‌కు చెందినది. ఇది లోతైన సముద్ర యాత్రల కోసం మనుషులతో కూడిన సబ్‌మెర్సిబుల్‌లను పంపించే సంస్థగా పేరు పొందింది.

సిబ్బందిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి "అన్ని ఎంపికలు" అన్వేషిస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే గల్లంతైన వారి సంఖ్యను కచ్చితంగా నిర్ధారించలేదు. నాలుగు రోజుల ఆక్సిజన్ సరఫరాతో డైవ్ చేసే సబ్‌మెర్సిబుల్ సాధారణంగా ఒక పైలట్, ముగ్గురు పేయింగ్ గెస్ట్‌లను తీసుకువెళుతుంది.
టైటానిక్ 1912లో తన తొలి ప్రయాణంలో మంచుకొండను ఢీకొట్టి అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. టైటానిక్ మునిగిపోవడంతో 1,500 మందికి పైగా మరణించారు. ఓడ శిథిలాలు 1985లో అట్లాంటిక్ మహాసముద్రం దిగువన గుర్తించారు
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో శిథిలాల సందర్శనల వీడియో చివరిసారిగా విడుదల చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications