వారో సవాల్: కేజ్రీవాల్ పార్టీతో ఇమ్రాన్‌ఖాన్ పార్టీకి పోలిక

ఎఎపి, పిటిఐ పార్టీలకు యువత నుండి, మధ్య తరగతి ప్రజానీకం నుండి మంచి మద్దతు లభిస్తుందని పేర్కొంది. రెండు పార్టీల మధ్య చాలా పోలికలున్నాయని తెలిపింది. ఈ రెండు పార్టీలకు నగర యువత, మధ్యతరగతి ప్రజలు మద్దతు ఉందని పేర్కొంది. ఎఎపి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఇమ్రాన్ పార్టీ కైబర్ పక్తుంక్వ ప్రావిన్స్‌లో పాలిస్తోందని, పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రధాన ప్రతిపక్షమని తెలిపింది.
ఢిల్లీలో ఎఎపి విజయం పలు రాజకీయ పార్టీలకు, ఎంతోమంది రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిందని, అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ కూడా అభినందనీయుడని పేర్కొంది.
కాగా, మహమ్మద్ అలీ జిన్నా కలగన్నట్లుగా నేటి పాకిస్తాన్ లేదని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం అన్నారు. పాక్ పట్టణ యువత, మధ్యతరగతి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ఢిల్లీలో ఎఎపి అధికారంలోకి వచ్చిన తరహా మార్పును పాక్ ప్రజలు ఆశిస్తున్నారన్నారు. భారత్ ఉపఖండం యూరోప్‌లా లేదన్నారు. కాశ్మీర్ సమస్య చర్చల ద్వారా పరిష్కారమవుతుందన్నారు.












Click it and Unblock the Notifications