పెన్నును గన్ అంటూ విమానంలో బెదిరింపులు: ల్యాండ్ చేసి, దించేశారు

Subscribe to Oneindia Telugu

బీజింగ్: తన వద్ద ఉన్న పెన్నునే గన్నుగా చూపించి.. దారి మళ్లించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ విమాన ప్రయాణికుడు. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్ చైనా విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఎయిర్ చైనాకు చెందిన విమానం ఆదివారం ఉదయం 8.40నిమిషాలకు హునాన్ ప్రావిన్స్‌లో చాంగ్షా విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఉదయం 11గంటలకు ఈ విమానం బీజింగ్‌కు చేరుకోవాల్సి ఉంది.

Air China plane diverts after fountain pen hostage drama

కాగా, విమానం బయలుదేరిన కొద్ది సేపటికే విమానంలోని ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందిలో ఒకరిని బందీగా చేసుకున్నాడు. తన దగ్గర ఉన్న ఫౌంటెన్ పెన్నును ఆయుధంగా చూపించి ప్రయాణికులను భయపెట్టాడు. దీంతో పై అధికారులకు సమాచారమిచ్చిన పైలట్లు.. విమానాన్ని జెంగ్జౌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

వెంటనే అత్యవసర భద్రతా దళాలు విమానం వద్ద చేరుకున్నాయి. ప్రయాణికులను, విమాన సిబ్బందిని దించేశారు. మరో విమానంలో వారిని వారి గమ్యస్థానాలకు పంపించేశారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా? లేదా అనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Air China flight had to be diverted after a passenger held a crew member hostage using a fountain pen as a weapon.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X