1967 తర్వాత తొలిసారి.. ‘ఈద్’ ప్రార్థనలు బంద్!
పవిత్ర రంజాన్ ముగింపు వేళ జెరూసలేం వీధులు భక్తి భావంతో కాకుండా, బాంబుల మోతతో దద్దరిల్లాయి. అల్-అక్సా మసీదు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక విషాదకరమైన చారిత్రక ఘట్టం నమోదైంది. 1967 అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత, మళ్ళీ ఇన్నేళ్లకు మొదటిసారి అల్-అక్సా మసీదులో ఈద్-అల్-ఫితర్ ప్రార్థనలు నిర్వహించకుండా ఇజ్రాయెల్ దళాలు పూర్తిస్థాయిలో అడ్డుకున్నాయి.
మసీదు తలుపులు మూసివేయడంతో, కనీసం ఆ పవిత్ర స్థలానికి అత్యంత సమీప పాయింట్‌కు చేరుకుని ప్రార్థనలు చేసుకోవాలనుకున్న వేలాది మంది పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. ఆక్రమిత జెరూసలేంలోని బాబ్ అల్-సహీరా (Bab al-Sahira) ప్రాంతం వద్ద భక్తులు ప్రార్థనల కోసం గుమిగూడగా, ఇజ్రాయెల్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. భక్తులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు 'స్టన్ గ్రెనేడ్ల'ను (మనుషులను తాత్కాలికంగా దిగ్భ్రమకు గురిచేసే బాంబులు), టియర్ గ్యాస్ ప్రయోగించడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.

పవిత్రమైన ఈద్ పండుగ రోజున ప్రార్థనలు చేసుకోనివ్వకుండా తమను అణచివేయడంపై పాలస్తీనియన్లు కన్నీరు మునిగవుతున్నారు. అల్-అక్సాను పూర్తిగా మూసివేయడం అనేది గత ఐదు దశాబ్దాలలో ఎప్పుడూ జరగలేదని, ఇది ఒక చారిత్రక అణచివేత అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
It is heartbreaking that Palestinians Muslim, while preparing to observe the Eid al-Fitr prayers in Al Aqsa mosque, were dispersed by Israeli government forces using tear gas.
— Tijjani umar dajji (@Tijjaniumardajj) March 20, 2026
May Allah protect us from the ظلم (oppression) of unjust people.
Yet some claim they're not terrorist. pic.twitter.com/nZiuqOEDG3
గత 21 రోజులుగా ఈ పవిత్ర మసీదు నిరంతరాయంగా మూతపడటం, ఆక్రమిత తూర్పు జెరూసలేంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇది కేవలం భద్రతా పరమైన చర్య కాదని, మత స్వేచ్ఛపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని జెరూసలేం గవర్నరేట్ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం నాడు వేలాది మంది పాలస్తీనియన్లు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసుకునేందుకు తరలిరాగా, ఇజ్రాయెల్ భద్రతా దళాలు వారిని లోపలికి అనుమతించకుండా నిలిపివేశాయి. దీంతో దిక్కుతోచని భక్తులు మసీదు గేట్ల వద్ద, డమాస్కస్ గేట్ సమీప వీధుల్లోనే చాపలు పరుచుకుని అల్లాహ్‌ను స్మరిస్తూ ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది
శిథిలాల సాక్షిగా విశ్వాసం..
మరోవైపు యుద్ధ వికృత క్రీడకు చితికిపోయిన గాజాలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆకలి, చావుల మధ్య కూడా పాలస్తీనియన్లు తమ మత విశ్వాసాన్ని వదులుకోలేదు. ఇజ్రాయెల్ దాడుల ధాటికి గాజాలోని 1,240 మసీదుల్లో సుమారు 1,100కు పైగా మసీదులు నేలమట్టమయ్యాయి.
అయినప్పటికీ, కూలిపోయిన మసీదుల గోడల నీడన, శిథిలాల మధ్యే కుటుంబాలు చేరి ఈద్ ప్రార్థనలు నిర్వహించడం వారి అచంచల విశ్వాసానికి అద్దం పడుతోంది. పండుగ పూట పిండివంటల ఘుమఘుమలు ఉండాల్సిన చోట గన్‌పౌడర్ వాసన ఉన్నా, ఆకాశమే కప్పుగా వారు సాగించిన ప్రార్థనలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.
Eid pray is prevented in #AlAqsa mosque, Jerusalemates prayed in streets of Jerusalem, rights of worship is violated, there is no security justification for denying access of people to their right of pray , this is not security, it is attack on people pic.twitter.com/wjY8P2d2Tf
— Riham Jafari (@RihamJafari) March 20, 2026
అల్-అక్సా మసీదు: వేల ఏళ్ల చరిత్ర.. మరువలేని ప్రాముఖ్యత
అల్-అక్సా మసీదు కేవలం ఒక కట్టడం కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల ఆరాధ్య దైవాల సన్నిధి. దీని చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అపారమైనది. ముస్లింలు మక్కా వైపు తిరిగి ప్రార్థనలు చేయడం ప్రారంభించకముందు, ప్రవక్త ముహమ్మద్ కాలంలో ఈ అల్-అక్సా మసీదు వైపు తిరిగే ప్రార్థనలు చేసేవారు. అందుకే దీనిని 'మొదటి ఖిబ్లా'గా పిలుస్తారు.
ప్రవక్త మిరాజ్ ప్రయాణం..
ఇస్లాం విశ్వాసం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ ఒకే రాత్రి మక్కా నుంచి జెరూసలేంకు ప్రయాణించి (ఇస్రా), అల్-అక్సా మసీదు నుండే స్వర్గా రోహణ (మిరాజ్) చేశారని నమ్ముతారు. ఈ కారణంగా మక్కా, మదీనా తర్వాత ముస్లింలకు ఇది మూడవ అత్యంత పవిత్రమైన ప్రదేశం.
యూదులకు పవిత్రం (టెంపుల్ మౌంట్):
ఇదే ప్రాంతం యూదులకు కూడా అత్యంత పవిత్రమైనది. దీనిని వారు 'టెంపుల్ మౌంట్' అని పిలుస్తారు. బైబిల్‌లో పేర్కొన్న మొదటి రెండు యూదు దేవాలయాలు ఇక్కడే ఉండేవని వారి నమ్మకం.
నాగరికతల నిలయం..
7వ శతాబ్దంలో ఉమయ్యద్ ఖలీఫాల కాలంలో నిర్మించబడిన ఈ మసీదు, శతాబ్దాలుగా అనేక యుద్ధాలను, ఆక్రమణలను చూసింది. సిలువ యుద్ధాల (Crusades) సమయంలో ఇది ఒక ప్యాలెస్‌గా, చర్చిగా కూడా వాడబడింది. చివరకు సలావుద్దీన్ అయ్యూబీ దీనిని తిరిగి ముస్లింల ఆధీనంలోకి తెచ్చారు.
యుద్ధం.. విశ్వాసాన్ని ఆపలేదు..
నేడు అల్-అక్సా మసీదు చుట్టూ జరుగుతున్న ఆంక్షలు కేవలం ఒక భూభాగ వివాదం మాత్రమే కాదు, అది కోట్ల మంది మతపరమైన మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం. మసీదును ఇస్లామిక్ పరిసరాల నుంచి వేరుచేసి కొత్త వాస్తవాలను రుద్దాలని చూస్తున్నారని పాలస్తీనియన్లు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం ఏదైనా, ఆంక్షలు ఎన్నైనా విశ్వాసాన్ని ఆపలేవని గేట్ల వద్ద మోకరించిన భక్తులు నిరూపిస్తున్నారు.
-
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇరాన్ క్షిపణి దాడిలో బూడిదైన 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'.. వీడియో వైరల్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..














Click it and Unblock the Notifications