భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్

భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ పాస్ పోర్టు కలిగిన వారు జర్మనీ విమానాశ్రయాల గుండా వీసా రహిత ట్రాన్సిట్ సదుపాయాన్ని జర్మనీ ప్రకటించింది.ఇకపై భారత పాస్‌పోర్ట్ కలిగిన వారు జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు ఎటువంటి 'ట్రాన్సిట్ వీసా' అవసరం లేదని జర్మనీ స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్‌ తో కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జర్మనీ ఈ విషయాన్ని వెల్లడించింది.

భారతీయులకు జర్మనీ శుభవార్త ప్రకటించింది. జర్మనీ ఛాన్సలర్​ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌.. జర్మనీలో పర్యటన సందర్భంగా జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు ట్రాన్సిట్ వీసా రహిత జర్నీ సదుపాయాన్ని కల్పించినట్లు స్పష్టం చేసింది. భారత్‌ తో కలిసి తాజాగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జర్మనీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన భారత్ కు వచ్చారు. భారతీయుల అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేసి, ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్- జర్మనీ సంయుక్త ప్రకటనలో పేర్కొంది.

ఇక ఫెడరల్ ఛాన్సలర్‌ గా మెర్జ్‌ కు ఇది తొలి పర్యటన. అయితే జర్మనీ తీసుకున్న తాజా నిర్ణయంతో భారతీయులు జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ప్రత్యేక ట్రాన్సిట్ వీసా అవసరం లేదు. ప్రయాణాలు సాఫీగా, వేగవంతంగా పూర్తవుతాయి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఈ తాజా ప్రకటనపై ఛాన్సలర్ మెర్జ్‌ కు ధన్యవాదాలు తెలిపారు.

Big Win for Indian Travelers Germany Announces Visa-Free Airport Transit for Indian Passports

భారత్- జర్మనీ దౌత్య సంబంధాలు 75వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో కీలక ఒప్పందాలు జరిగాయి. రక్షణ, విద్య, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో రెండు దేశాలు 19 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ మేరకు సుస్థిర అభివృద్ధి, పర్యావరణ అనుకూల ఇంధన ప్రాజెక్టుల కోసం జర్మనీ భారత్‌ కు 1.24 బిలియన్ యూరోల ఆర్థిక సహాయాన్ని తాజాగా ప్రకటించింది. అలాగే జర్మనీ విశ్వవిద్యాలయాలు భారత్‌ లోని పలు నగరాల్లో తమ క్యాంపస్‌ లను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+