ట్రంప్ చనిపోతే ఉచిత బీర్.. చివరికి సీన్ రివర్స్!
అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ మినోక్వా బ్రూయింగ్ కంపెనీ ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఇకపై ఆ కంపెనీ ఆ రాష్ట్రంలో తన కార్యకలాపాలను కొనసాగించలేదు. ఆ బ్రూవరీ యజమాని కిర్క్ బ్యాంగ్‌స్టాడ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్పద కామెంట్స్ చేయడం, ఆయన మరణిస్తే ఉచిత బీర్ ఇస్తామని ప్రకటించడంతో ఆ రాష్ట్ర అధికారులు ఈ బ్రూవరీ లైసెన్స్ ను రద్దు చేశారు. ఈ నిర్ణయం బ్రూవరీ యజమాని కిర్క్ బ్యాంగ్‌స్టాడ్‌కు దిగ్భ్రాంతిని కలిగించింది.
అసలేం జరిగిందంటే?
మినోక్వా బ్రూయింగ్ కంపెనీ సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా అనేక పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఈ ఏడాది జనవరిలో ఓ ప్రముఖ వ్యక్తి(డొనాల్డ్ ట్రంప్) మరణించిన రోజున ఉచిత బీర్ ఇస్తామని ఈ కంపెనీ సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. నేరుగా పేరు చెప్పకపోయినప్పటికీ.. అది ట్రంప్ ను ఉద్దేశించే అని స్పష్టమైంది. అంతే కాకుండా ఏప్రిల్‌లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వద్ద జరిగిన కాల్పుల ఘటన తర్వాక.. 'మాకు దాదాపు ఫ్రీ బీర్ డే వచ్చేసింది.. ప్రతిఘటనలో ఉన్నవారు తమ గురిని మెరుగుపరుచుకోవాలి" అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇదికాకుండా అమెరికా ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కూడా ఈ బ్రూవరీ వరుసగా పోస్టులు పెట్టింది.

చర్యలు చేపట్టిన అధికారులు
విస్కాన్సిన్ రెవెన్యూ శాఖ మినోక్వా బ్రూయింగ్ కంపెనీకి చెందిన రెండు బ్రూవర్ పర్మిట్‌లతో పాటు ఓ ఆల్కహాల్ బేవరేజ్ వేర్ హౌస్ పర్మిట్ ను రద్దు చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చింది. బ్రూవరీ నిర్వహణకు అవసరమైన సరైన అనుమతులు లేకపోవడం, ఇల్లినాయిస్ నుంచి తెప్పించి స్వాధీనం చేసుకున్న క్యాన్డ్ బీర్ పై చెల్లించాల్సిన పన్నులను ఎగవేయడమే ఈ చర్యకు ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు. ఈ లైసెన్స్ రద్దు ఉత్తర్వులు ఆ రాష్ట్రంలో ఆగస్టు 4 నుంచి అమలులోకి రానున్నాయి.
తీవ్రంగా మండిపడిన యజమాని
అధికారుల నిర్ణయంపై యజమాని కిర్క్ బ్యాంగ్‌స్టాడ్ తీవ్రంగా మండిపడ్డారు. పన్ను ఎగవేతల పేరుతో తన వ్యాపారాన్ని మూసివేయించడం వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ ఆయన విమర్శించారు. "మా బ్రూవరీకి వచ్చే దాహంతో వారికి నేను బీరు అమ్మడం ఆపే ముందు, వారు నన్ను నా ట్యాప్‌రూమ్‌ల నుంచి బలవంతంగా బయటకు లాగాల్సి ఉంటుంది" అని ఆయన సబ్‌స్టాక్ పోస్ట్‌లో స్పష్టం చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శికి అప్పీల్ చేసుకోవడానికి ఆగస్టు 4 వరకు గడువు ఉండటంతో తాను ప్రాణాలకు తెగించి న్యాయపోరాటం చేస్తానని కిర్క్ బ్యాంగ్‌స్టాడ్ చెప్పారు. ఈ కేసు కోసం కోర్టు మెట్లు ఎక్కకముందే న్యాయవాదులకు దాదాపు లక్ష డాలర్లు ఖర్చువుతుందని.. తన కంపెనీ న్యాయ రక్షణ నిధికి ఆర్థిక సహాయం చేయాలని ఆయన మద్దతుదారులను అభ్యర్థించారు.












Click it and Unblock the Notifications