"హోమ్స్ ఫర్ ఉక్రెయిన్".. శరణార్థులకు ఆశ్రయమిస్తే నెలకు 450 డాలర్లు !! : బ్రిటన్ ఆఫర్
ఉక్రెయిన్‌పై దాడులను రష్యా మరింత పెంచింది. మిస్సైల్స్, క్షిపణులతో విరుచుకుపడుతోంది. చిన్న చిన్న నగరాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇప్పటికే పలు పట్టణాలను రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. బాంబు దాడులతో ఇప్పటికే వేలాది మంది మృతి చెందారు. దాదాపు 20 లక్షల మంది నిరాశ్రయులైయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సరిహద్దు దేశాలకు పారిపోతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి తమ దేశాల్లో ఆశ్రయం కల్పించేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చాయి.

ఆశ్రయం కల్పిస్తే ఒక్కో శరణార్థికి 450 డాలర్లు..
ఉక్రెయిన్ నుంచి వచ్చే శరణార్థులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించేందుకు బిట్రన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. "హోమ్స్ ఫర్ ఉక్రెయిన్" పథకాన్ని ప్రకటించారు.. ఈ ప్రోగ్రామ్ కింద బ్రిటన్ వాసులు ఎవరైనా ఉక్రెయిన్ నుంచి వచ్చిన శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తే వారికి ప్రభుత్వం ప్రతి నెల ఒక్కో శరణార్థికి 450 డాలర్లు చొప్పులు చెల్లిస్తామని వెల్లడించారు. మానవతా దృక్పథంతో మనమందరం నీడ లేని వారికి ఆశ్రయం ఇద్దామని పేర్కొన్నారు.

"హోమ్స్ ఫర్ ఉక్రెయిన్ " ...
ఈ "హోమ్స్ ఫర్ ఉక్రెయిన్ "కింద శరణార్థులకు కనీసం ఆరు నెలల పాటు అద్దె లేకుండా ఇల్లు ఇచ్చేందుకు ముందుకు రావాలని బ్రిటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మిషెల్ గోవె కోరారు. ఆశ్రయం ఇచ్చేవారి పేర్లను సంబంధిత అధికారుల వద్ద తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ పథకం కింద స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ గ్రూపులు, వ్యాపార సంస్థలు, వ్యక్తులు ఎవరైనా నమోదు చేయించుకోవచ్చని పేర్కొన్నారు. ఉక్రెయిన్ వాసులకు ఆశ్రయమిచ్చి వారికి ఉండగా నిలవాల్సిన అవసరం ఉందని కోరారు.
Recommended Video

వీసా అవసరం లేదు.. రండి
ఉక్రెయిన్ నుంచి వచ్చే శరణార్థులు వలసల వీసా వంటి పత్రాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఇలాంటి నిబంధనలు వారికి సాయం చేయడానికి అడ్డుగా ఉన్నాయని బ్రిటన్ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చే ప్రజలకు వీసాలు అవసరం లేదని ప్రకటించారు. వారు కేవలం వారి దేశం పాస్ పోర్టు ఉంటే చాలని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రం నుంచి తరలివచ్చే ప్రజలకు తాము ఎల్లప్పుడూ సాయం చేస్తామని చెప్పారు. అంతే కాదు.. వారికి బ్రిటన్‌లోనే విద్యా, వైద్యం, ఉద్యోగ సదుపాయాలు కల్పిస్తామని బోరిస్ భరోసా ఇచ్చారు. అటు జర్మనీ, పోలాండ్ దేశాలు కూడా ఉక్రెయిన్ శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. పోలాండ్‌కు సుమారు 15 లక్షల మంది, హంగేరీకి 2,35,000 మంది వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications