Rushi Sunak: మరోసారి విమర్శలపాలైన రుషి సునాక్.. అస్సలు ఏం జరిగిందంటే..!

బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ మరోసారి విమర్శలపాలయ్యారు. ఓ నిరాశ్రయుడితో సునాక్ జరిపిన సంభాషణపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిరాశ్రయుడితో ఇలానా మాట్లాడేది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

షెల్టర్ హోమ్‌

షెల్టర్ హోమ్‌


ఇటీవల లండన్‌లోని షెల్టర్ హోమ్‌ను సునాక్ సందర్శించారు. అక్కడి సూప్‌ కిచెన్‌లోకి వెళ్లిన రిషి స్వయంగా వడ్డించారు. ఆహారం వడ్డిస్తున్నప్పుడు, సునక్ రాత్రి నిద్రించడానికి స్థలం దొరక్క ఇబ్బంది పడుతున్న వ్యక్తితో మాట్లాడారు. సునాక్ మొదట నిరాశ్రయుడి పేరు అడిగారు. తర్వాత ఏం తింటారని అడిగారు.

టోస్ట్, గుడ్ల ప్లేట్

టోస్ట్, గుడ్ల ప్లేట్

సునాక్ అతనికి సాసేజ్, టోస్ట్, గుడ్ల ప్లేట్ ఇచ్చాడు. సునక్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు. ఈ సమయంలో, సునక్ అతన్ని అడిగాడు, మీరు ఏదైనా పని చేస్తారా. దానికి అతను బదులిస్తూ .. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మీరు ప్రయత్నిస్తున్నారా? అని ప్రధానిని అడిగాడు.

వ్యాపారంలో ఆసక్తి

వ్యాపారంలో ఆసక్తి


ఆ తర్వాత సునాక్ మీరు ఏదైనా వ్యాపారంలో ఉన్నారా? అని నిరాశ్రయుడిని ప్రశ్నించారు. దానికి అతను స్పందిస్తూ లేదు సార్. తాను నిరాశ్రయుడిని. కానీ నాకు వ్యాపారంలో ఆసక్తి ఉంది అని చెప్పాడు. తనకు
ఉండటానికి ఇల్లు లేదని చెప్పాడు. వసతి కల్పించాలని కోరారు. అయితే రిషి సునాక్ ఆ విషయాన్ని పట్టించుకోకుకండా మరో విషయం మాట్లాడారు.

ఏంజెలా రేనర్


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లండ్‌లోని ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకురాలు ఏంజెలా రేనర్ ట్విట్టర్‌లో రుషి సునాక్ సంభాషణపై స్పందించారు. 'ఇది విచారకరమైన, బాధాకరమైన పరిస్థితి అని నేను ఆందోళన చెందుతున్నాను' అని రాశారు. పీఎం సునాక్ ప్రజల సమస్యలను విస్మరించరాదని, నిరాశ్రయులైన వారికి వసతి కల్పించాలని ఓ నేటిజన్ కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+