వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహం ముదిరింది: కిమ్‌కు తన సొంత ఫోన్ నెంబర్ ఇచ్చిన ట్రంప్, ఆదివారం ఫోన్!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికా, ఉత్తరకొరియా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల భేటీ తర్వాత ఆ దేశాధినేతల మధ్య మంచి స్నేహ బంధం కుదిరినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరమే తమ దేశాలకు రావాలంటూ ఒకరినొకరు ఆహ్వానించుకున్నారు కూడా.

షాక్: ట్రంప్‌తో భేటీకి టాయ్‌లెట్ వెంట తెచ్చుకున్న కిమ్, ఆ భయమే కారణమా? షాక్: ట్రంప్‌తో భేటీకి టాయ్‌లెట్ వెంట తెచ్చుకున్న కిమ్, ఆ భయమే కారణమా?

తాజాగా, మరో విశేషం వెలుగుచూసింది. అదేమిటంటే... 'కిమ్‌.. నువ్వు నాకు ఎప్పుడైనా కాల్‌ చెయ్యొచ్చు' అంటూ డొనాల్డ్ ట్రంప్‌ తన సొంత డైరెక్ట్ ఫోన్‌ నంబరు కూడా ఇచ్చారట. అంతటితో ఆగకుండా.. ఈ ఆదివారం కిమ్‌కు ట్రంప్‌ ఫోన్‌ కూడా చేయనున్నట్లు తెలిసింది.

Call Any Time: Trump Says He Gave North Koreas Kim Jong Direct Number

ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా మీడియాకు తెలిపారు. ట్రంప్‌-కిమ్‌ భేటీపై ఓ మీడియా ఛానల్‌తో ట్రంప్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన డైరెక్ట్‌ ఫోన్‌ నంబరును కిమ్‌కు ఇచ్చినట్లు ట్రంప్‌ చెప్పారు. అవసరమైనప్పుడు తనకు ఫోన్‌ చేయమని కిమ్‌కు చెప్పినట్లు వెల్లడించారు.

చిగురించిన స్నేహం: అత్యంత సురక్షితమైన 'బీస్ట్' లోపలి భాగాన్ని చూపిన ట్రంప్చిగురించిన స్నేహం: అత్యంత సురక్షితమైన 'బీస్ట్' లోపలి భాగాన్ని చూపిన ట్రంప్

ఇక ఈ ఆదివారం ఫాదర్స్‌ డే సందర్భంగా మీ ప్రణాళికలేంటీ అని మీడియా ప్రశ్నించగా.. 'నేను ఉత్తరకొరియాకు ఫోన్‌ చేయనున్నాను' అని ట్రంప్‌ సమాధానమిచ్చారు. 'ఉత్తరకొరియా ప్రజలతో, ఆ దేశంలో ఉన్న అమెరికా ప్రజలతో నేను మాట్లాడబోతున్నాను' అని చెప్పారు. సింగపూర్‌ వేదికగా జూన్‌ 12న ట్రంప్‌, కిమ్‌ భేటీ జరిగిన విషయం తెలిసిందే.

English summary
U.S. President Donald Trump said on Friday he had given Kim Jong Un a direct phone number and suggested he might call the North Korean leader on Sunday, following their summit in Singapore this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X