భారత్ కు ఊహించని షాక్.. పాకిస్థాన్ కు చైనా'బ్రహ్మాస్త్రం' అందజేత..!
భారత్ కు ప్రధాన శత్రు దేశాలు పాకిస్థాన్, చైనా. ఇరు దేశాలూ భారత్ తో సరిహద్దును పంచుకుంటాయి. ఇటీవల కేరళ తీరం సమీపంలోని అరేబియా సముద్రంలో చైనాకు చెందిన ఓ సరకు రవాణా నౌక అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే భారత నేవీ సిబ్బంది ప్రాణాలకు తెగించి 14 మంది చైనా దేశస్థులను కాపాడింది. కానీ చైనా మాత్రం మన శత్రువు పాకిస్థాన్ కు అండదండగా నిలుస్తూ ప్రతిసారీ తన వక్ర బుద్ధిని చాటుతోంది.
ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రతిదాడికి దిగిన పాకిస్థాన్.. చైనా, టర్కీ దేశాలు అందించిన డ్రోన్లు, క్షిపణులతో భారత్ పై విరుచుకుపడింది. కానీ రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాక్ డ్రోన్లను ధ్వంసం చేసింది భారత్. దాదాపు 600లకు పైగా డ్రోన్ లను నేలమట్టం చేసింది భారత ఆర్మీ.
ఈ క్రమంలో తాజాగా భారత్ కు బిగ్ షాక్ తగిలినట్లుగా భావించవచ్చు. ఎందుకంటే చైనా.. పాకిస్థాన్ కు భారీ ఆయుధాలను ఆఫర్ చేసింది. అత్యాధునిక జే-35 స్టీల్త్ యుద్ధవిమానాలను కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని పాక్ అధికారులు స్వయంగా ప్రకటించారు. త్వరలో ఇరు దేశాల మధ్య బిగ్ డీల్ ఆవిష్కృతం కానున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్న డబ్బును ఈ ఆయుధాల కొనుగోలుకు పాకిస్థాన్ వినియోగించేందుకు సిద్ధమైనట్లు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.
చైనా నుంచి పాక్ కొనుగోలు చేయనున్న ఆయుధాల్లో ప్రధానంగా 40 5th జనరేషన్ షెన్ యాంగ్ జే-35 ఫైటర్ జెట్స్, షాక్సీ కేజే- 500 ఎర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్, సర్ ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టెమ్స్, హెచ్ క్యూ-19 ఎయిర్ డిఫెన్స్ సిస్టెమ్.. లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. దీంతో భారత్ అలెర్ట్ అయింది. పాకిస్థాన్ వైఖరిని నిశితంగా గమనిస్తోంది.

ప్రస్తుతం చైనా వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాల్లో జే-35 ఫైటర్ జెట్స్ ఒకటి. వీటిని పాక్ కు అందిస్తుండటంపై భారత్ అలెర్ట్ అయింది. మరోవైపు పాకిస్థాన్ నుంచి 40 జేఎఫ్-17 ఫైటర్ జెట్స్ ను కొనుగోలు చేసేందుకు అజర్ బైజాన్ ఒప్పందం చేసుకుంది. వీటి విలువ 4.6 బిలియన్ డాలర్లు ఉంటుందని సమాచారం.












Click it and Unblock the Notifications