ప్రపంచదేశాలను కలవరపెడుతోన్న చైనా కొత్త వైరస్
ప్రపంచ దేశాలను వణికించేందుకు మరో కొత్త వైరస్ రాబోతోంది. కరోనా మహమ్మారి పురుడుపోసుకున్న చైనా దేశంలోనే ఇది గుర్తించబడడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అంతుచిక్కని నిమోనియా వ్యాధితో స్కూలు విద్యార్థులు పదుల సంఖ్యలో ఆస్పత్రిపాలవుతుండడంతో దీని తీవ్రతపై వైద్యులు అంచనా వేయలేకపోతున్నారు. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే బీజింగ్, లియోనింగ్ సిటీల్లోని ఆస్పత్రులు బాధితల విధ్యార్థుల తల్లిదండ్రుల ఆర్తనాదాలతో భయానకంగా దర్శనమిస్తున్నాయి. అక్కడి తాజా పరిస్థితులు కరోనా మిగిల్చిన చేతు జ్ఞాపకాలను, భయాలను పునరావృతం చేసేలా ఉన్నాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ మిస్టరీ నిమోనియా అది వేగంగా వ్యాపిస్తుండటంతో స్కూళ్ల మూసివేత తప్పదని ఇప్పటికే స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి.
కరోనా సంక్షోభాన్ని గుర్తుకు తెస్తోందా : ఈ నిమోనియా వ్యాధి బాధిత పిల్లల్లో తీవ్రమైన జ్వరం, ఊపిరితిత్తుల్లో మంట వంటి అసాధారణ లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తున్నట్లు సమాచారం. అయితే ఇతర శ్వాసకోశ వ్యాధుల్లో కనిపించే దగ్గు, ఇతర లక్షణాలు ఈ వ్యాధిలో కనిపించడం లేదని వైద్యులు దృవీకరించారు. ఇప్పటికే బీజింగ్, లియోనింగ్ ఆస్పత్రులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో తాజా పరిస్థితులు మునుపటి కరోనా సంక్షోభాన్ని గుర్తుకు తెస్తున్నాయని స్థానికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అలా బయటపడింది : అయితే, చైనాలో ఏం జరిగినా అది తీవ్ర రూపం దాల్చే వరకూ బాహ్య ప్రపంచానికి తెలియకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే చైనా.. ఈ వ్యాధి వ్యాప్తి విషయంలోనూ ఆలానే ప్రవర్తించింది. అయితే, ప్రపంచదేశాల్లో మనుషులు, జంతువుల్లో వ్యాపించే వ్యాధులను ట్రాక్ చేసే సర్వైవలెన్స్ ప్లాట్‌ఫామ్ ప్రోమెడ్ చైనాలో ఈ తాజా నిమోనియా వ్యాప్తి గురించి బయటపెట్టింది. ఈ శ్వాసకోశ వ్యాధి చైనాలో ఎప్పుడు మొదలైందో స్పష్టంగా తెలియదని, అలాగే పెద్దలు ఈ వ్యాధికి గురయ్యారా లేదా అన్న విషయాన్ని కూడా వెల్లడించలేదు. మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా వ్యాప్తి గురించి కూడా ఈ సంస్థనే 2019లో మొదట హెచ్చరించింది. దీని తీవ్రత, వ్యాప్తికి సంబందించి వార్తలు బయటకు రావడంతో ఇది మరో మహమ్మారికి మారుతుందేమో అని ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి












Click it and Unblock the Notifications