వైరల్ వీడియో: ఛీ.. ఛీ.. ఇండియా పరువు తీసావ్.. మీ వల్లే వీసా ఫీజు పెరిగింది..!

అమెరికా వెళ్లాలని చాలా మంది యువతకు డ్రీమ్ గా ఉంటుంది. ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాలు కోసం భారత్ నుంచి అగ్రరాజ్యానికి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. భారత్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది. 2023-24లో అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 3.32 లక్షలకు చేరింది. అలాగే 2023లో గ్రీన్ కార్డ్ పొందిన వారిలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక H-1B వీసాలలో 80 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు.


అమెరికా వెళ్తున్న విద్యార్థుల్లో చాలామంది పేద, మధ్య తరగతి కుటుంబాలే ఉన్నాయి. ఉన్నత చదువుల కోసం అని అమెరికా వెళ్లిన యువత అక్కడ దొంగతనాలు చేయడం, భిక్షాటన చేయడం చేస్తున్నట్లు ఇటీవల కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికాలోని ఓ ట్రైన్ లో ఓ భారత అమ్మాయి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. చుట్టూ అమెరికా ప్రజలు నిశ్శబ్దంగా జర్నీని కొనసాగిస్తుంటే ఈ అమ్మాయి మాత్రం వాళ్లకు అడ్డంగా డ్యాన్స్ చేస్తూ వికృతమైన స్టెప్స్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఈ వీడియోపై నెటిజెన్లు పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. భారత్ పరువు తీస్తున్నారని అంటున్నారు. అప్పు చేసి అమెరికా పంపిస్తే ట్రైన్స్ లో రీల్స్ చేస్తున్నారని మండిపడుతున్నారు. మీలాంటి వాళ్ల వళ్లే అమెరికా వీసా ధరలు పెంచేసిందని మరొకరు కామెంట్ చేశారు. ఆమెను తక్షణమే ఇండియా పంపించాలని అంటున్నారు. దేశ ప్రతిష్టకు ఆమె భంగం కలిగిస్తోందన్నారు.

Cringe Alert Indian Girl s Wild Dance in US Subway Goes Viral Leaves Passengers Squirming

ఇక తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై హెచ్1బీ వీసా కోసం నూతన నిబంధనలను ప్రవేశపెట్టారు. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజు లక్ష డాలర్‌ లకు(రూ.83 లక్షలు) పెంచేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అమెరికాలోని టెక్నాలజీ రంగం, అలాగే అమెరికా హెచ్1బీ వీసాపై ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఐటీ, టెక్నాలజీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+