వామ్మో భారీ వరదలు.. కొట్టుకుపోయిన స్కూల్ బస్సు.. 49 మంది మృతి..!
దక్షిణాఫ్రికాలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. వరదల బీభత్సానికి ఇప్పటివరకు49 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. సౌతాఫ్రికాలోని తూర్పు కేప్ ప్రావిన్స్ లో వరదలు ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు సమాచారం.
దక్షిణాఫ్రికాలోని తూర్పు కేప్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా ఇప్పటివరకు 49 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాలు భారీ వర్షం, వరదల కారణంగా అతలాకుతలం అయినట్లు తెలిపారు. కేప్ ప్రావిన్స్ లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
అయితే భారీ వర్షాలు, వరదలకు కేప్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల రోడ్లు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో ఓ స్కూల్ బస్సు కొట్టుకుపోయింది. బస్సు జాడ తెలియాల్సి ఉంది. స్కూల్ బస్సులో ఎంతమంది చిన్నారులు ఉన్నారన్నదానిపై స్పష్టత లేదు. వరదల కారణంగా కొట్టుకుపోయిన స్కూల్ బస్సును అక్కడి అధికారులు గాలిస్తున్నారు.
మరోవైపు భారీ వరదల కారణంగా వరదల కారణంగా ప్రజల ఆస్తులు, ఇళ్లు,భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అటు వీధివ్యాపారాలకు కూడా వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరదల్లో కొట్టుకుపోయి ఇప్పటివరకు 49 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మందికి తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం.

వరదలపై సమీక్ష జరిపిన ఉన్నతాధికారులు ప్రజల్ని వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించే మార్గాలను అన్వేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications