మోదీని పొగుడుతూనే..: నడ్డి విరిచిన ట్రంప్
Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి కొరడా ఝుళింపించారు. అనేక దేశాలపై కొత్తగా అదనపు వడ్డింపులు వడ్డించారు. భారీగా టారిఫ్‌ను పెంచారు. ఈ జాబితాలో భారత్ సైతం ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 26 శాతం మేర టారిఫ్ విధించారు భారత్‌పై.
మొన్నటికి మొన్న ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను విధించారు ట్రంప్. 25 శాతం వరకు టారిఫ్‌ను పెంచారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై మార్చి 31వ తేదీన సంతకం చేశారు. అమెరికాకు ఆటోమోటివ్ వాహనాలను ఎగుమతి చేస్తోన్న భారత్ సహా అన్ని అన్ని దేశాలపైనా దీని ప్రభావం పడినట్టయింది. ఈ టారిఫ్.. ఈ నెల 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.

అక్కడితో ఆగట్లేదాయన. ఇప్పుడు కొత్తగా భారత్‌పై 26 శాతం వరకు టారిఫ్ విధించారు. భారత్ నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపైనా ఈ పన్ను వర్తిస్తుంది. అంటే ఇప్పటివరకు ఉన్న టారిఫ్‌కు మరో 26 శాతం మేర అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ట్రంప్. మేక్ అమెరికా వెల్తీ అగైన్ కాన్సెప్ట్ గురించి వివరించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై భారత్ విధించిన పన్నులు వెరీ వెరీ టఫ్ అంటూ మండిపడ్డారు. ఈ ఉద్దేశంతోనే తాము కూడా రెసిప్రోకల్ (పరస్పర) టారిఫ్‌ను పెంచాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్.
భారత్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపైనా 26 శాతం టారిఫ్ వర్తిస్తుందని వెల్లడించారు. అయినప్పటికీ- ఇది తమ ఉత్పత్తులపై భారత్ వసూలు చేస్తోన్న టారిఫ్‌లో సగం మాత్రమేనని ట్రంప్ పేర్కొన్నారు. తమ దేశ ఉత్పత్తులపై భారత్ విధించిన పన్నులతో పోల్చుకుంటే ఈ మొత్తం తక్కువేనని వ్యాఖ్యానించారు. తమపై భారత్ 52 శాతం పన్నులను విధిస్తోందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని ప్రశంసించారు. స్నేహితుడే అయినప్పటికీ తమను సరిగ్గా ట్రీట్ చేయట్లేదని, వైట్ హౌస్‌లో భేటీ సందర్భంగా ఈ విషయాన్ని ఆయనతోనే చెప్పానని వివరించారు.
భారత్‌తో పాటు దాదాపు అన్ని దేశాల దిగుమతులపై కనిష్టంగా 10 శాతం వరకు టారిఫ్‌ను పెంచారు డొనాల్డ్ ట్రంప్. ఆయా దేశాలు విధించిన టారిఫ్‌ను బట్టి చూస్తే- ఇది దారుణమైన అసమతౌల్యమని పేర్కొన్నారు. తాము వసూలు చేస్తోన్న టారిఫ్‌కు మించి ఆయా దేశాలు పన్నులను విధిస్తోన్నాయని అన్నారు.
తమ దేశ పౌరుల పన్నులను ఇతర దేశాలు దోచుకుంటున్నాయని, ట్యాక్స్‌పేయర్లు 50 సంవత్సరాలకు పైగా దోపిడీకి గురవుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. ఇకపై అలా జరగదని తేల్చి చెప్పారు.
2021 నుండి 2024 వరకు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.. భారత్. 2023లో వస్తువులు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం 190.08 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికాతో 43.65 బిలియన్ల డాలర్ల మేర ఎగుమతులు- దిగుమతులు కొనసాగుతున్నాయి. 83.77 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తోంది భారత్. అలాగే- 40.12 బిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది.












Click it and Unblock the Notifications