Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్, ఇతర దేశాలకు కంపెనీలు: ఉద్యోగాలు పోతే ఏం చేద్దాం.. ట్రంప్

అమెరికాలోని కంపెనీలు ఇక్కడి వారికే ఉద్యోగాలు ఇవ్వాలని యూఎస్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. ట్రంప్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు.

వాషింగ్టన్: అమెరికాలోని కంపెనీలు ఇక్కడి వారికే ఉద్యోగాలు ఇవ్వాలని యూఎస్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. ట్రంప్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు తమ వ్యాపారాన్ని భారత్, మెక్సికో, చైనా సహా ఇతర దేశాలకు తరలించేందుకు సన్నద్ధమవుతున్నాయి.

ఆ కంపెనీలు వెళ్లిపోతే ఇప్పటికే వాటిల్లో పని చేస్తున్న అమెరికన్లు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉపాధి ఎలా కల్పించాలి? అనే విషయమై అయిదు ప్రముఖ కంపెనీల నుంచి ట్రంప్‌ సలహా తీసుకోనున్నారు.

క్యాటర్‌ పిల్లర్‌, యునైటెడ్‌ టెక్నాలజీస్‌ కార్ప్‌, డానా ఇంక్, 3ఎం కో, జనరల్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీలు తమ వ్యాపారాన్ని మెక్సికో, చైనా, భారత్ ఇతర దేశాలకూ తరలించేందుకు సిద్ధమవుతున్నాయి.

donald trump

దీంతో అమెరికా కార్మిక శాఖ రికార్డులను ఓ ప్రముఖ వార్తా సంస్థ సేకరించి విశ్లేషించింది. అయిదు కంపెనీలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు గురువారం ట్రంప్‌ను కలవనున్నారు. కంపెనీలు విదేశాలకు తరలిపోవడంతో ఉపాధి కోల్పోయే వారికి ఉద్యోగులను కల్పించే విషయంపై ఆయా కంపెనీలు ఇచ్చే సలహాలను ట్రంప్‌ తీసుకుంటారు.

అమెరికాలో ఉన్న ఆ అయిదు కంపెనీలను తరలించడం ద్వారా వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీలకు చెందిన మొత్తం 2,300 మంది కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోనున్నారు. కంపెనీలు ఈ విషయం చెప్పాయి.

ఈ సమావేశానికి వస్తున్న కంపెనీలు కల్పించిన ఉద్యోగాలను బట్టి చూస్తే కోల్పోయే ఉద్యోగాల సంఖ్య చాలా స్వల్పమేనని తెలుస్తోంది. ఎందుకంటే ఒక్క జనరల్‌ ఎలక్ట్రిక్‌లోనే మొత్తం 125,000 మంది అమెరికన్లు ఉద్యోగులుగా ఉన్నారు.

అమెరికా ఉద్యోగాలను కాదని విదేశాలకు వెళ్లే కంపెనీలపై పన్నులు విధిస్తానని చెప్పారు. ప్రస్తుత సమావేశంలో వ్యాపారాలను ఇతర దేశాలకు తరలించే అంశంపై వారి కారణాలను తెలుసుకోవడానికి ట్రంప్‌ వ్యాపారవేత్తలతో మాట్లాడతారని వైట్ హౌస్ తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+