అమెరికా చేసిన అతిపెద్ద తప్పు అదే.. వందేళ్ల నాటి రూల్ బద్దలు కొట్టిన ట్రంప్..

పనామా కాలువపై నియంత్రణను వదులుకోవడం అమెరికా చేసిన చారిత్రక తప్పిదమని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఉత్తర అమెరికా-దక్షిణ అమెరికా ఖండాలను వేరుచేసే వ్యూహాత్మక పనామా జలమార్గాన్ని చైనా తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూస్తోందని, కానీ తాము అందుకు అస్సలు అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. మెడోరాలో బుధవారం జరిగిన 'థియోడర్ రూజ్‌వెల్ట్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ' ప్రారంభోత్సవంలో ట్రంప్ ప్రసంగిస్తూ.. గతంలో పనామా కాలువను ఆ దేశానికి అప్పగించాలన్న యూఎస్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

Donald Trump Vows US Will Never Allow China To Take Control Over Strategic Panama Canal Details Inside

"అప్పగించడం ఎంత మూర్ఖత్వం?"

1977లో జరిగిన టోరిజోస్-కార్టర్ ఒప్పందాల ప్రకారం.. 1999లో పనామా కాలువ పూర్తి నియంత్రణను అమెరికా ఆ దేశానికి బదిలీ చేసింది. ఈ నిర్ణయంపై ట్రంప్ స్పందిస్తూ.. "మనం పనామా కాలువను ఉచితంగా ఇచ్చేశాం. వారు నియంత్రణ సాధించగానే మొదట ఏం చేశారో తెలుసా? ఓడల రవాణా ఛార్జీలను ఏకంగా నాలుగు రెట్లు పెంచారు. అయినా ఒక్క ఓడ కూడా తగ్గలేదు. ఆ తర్వాత మళ్లీ రెండు రెట్లు పెంచారు. దీనివల్ల వారు ఏళ్ల తరబడి భారీగా డబ్బు సంపాదించారు. అసలు అంతటి వ్యూహాత్మక మార్గాన్ని వదులుకోవడం ఎంత మూర్ఖత్వం?" అని ప్రశ్నించారు. ఇప్పుడు చైనా ఈ కాలువను ఆక్రమించుకోవాలని చూస్తోందని, కానీ తాము దాన్ని అడ్డుకుంటామని ట్రంప్ పేర్కొన్నారు.

Panama Canal: పనామా కాలువపై చైనా నియంత్రణను తగ్గించాలి.. అమెరికా హెచ్చరిక
Panama Canal: పనామా కాలువపై చైనా నియంత్రణను తగ్గించాలి.. అమెరికా హెచ్చరిక

పుట్టిన దేశాన్ని బట్టి పౌరసత్వం పై అసంతృప్తి!

ఇదే వేదికపై ట్రంప్ అమెరికాలో పుట్టే పిల్లలకు ఆటోమేటిక్‌గా వచ్చే 'బర్త్‌రైట్ సిటిజన్‌షిప్' అంశంపై మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టారు. "బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అనేది ఇతర దేశాల నుంచి వచ్చే ధనవంతుల కోసం ఉద్దేశించింది కాదు. అమెరికా అంతర్యుద్ధం ముగిసిన నెల రోజుల తర్వాత బానిసల పిల్లల సంక్షేమం కోసం దీనిని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు చైనా నుంచి ధనవంతులు గల్ఫ్‌స్ట్రీమ్ ప్రైవేట్ జెట్లలో వచ్చి ఇక్కడ పిల్లల్ని కని పౌరసత్వం పొందుతున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తప్పుడు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమస్యను మేము త్వరలోనే పరిష్కరిస్తాం" అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

 Suez Canal చరిత్ర ఏంటి.. నౌక చిక్కుకుపోవడంతో గంటకు ఎన్ని వేల కోట్లు నష్టం వాటిల్లుతోంది..?
Suez Canal చరిత్ర ఏంటి.. నౌక చిక్కుకుపోవడంతో గంటకు ఎన్ని వేల కోట్లు నష్టం వాటిల్లుతోంది..?

అధ్యక్షుడి అధికారాల పెంపుపై హర్షం

ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు అధ్యక్షుడి అధికారాలను పెంచుతూ ఇచ్చిన తీర్పును ట్రంప్ కొనియాడారు. జూన్ 29న సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో.. గత 91 ఏళ్ల నాటి పాత తీర్పును తిరగరాస్తూ, సెనేట్ ఆమోదించిన ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల అధికారులను తొలగించే పూర్తి అధికారాన్ని అధ్యక్షుడికి కట్టబెట్టింది.

దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. "1932లో ఎఫ్‌డిఆర్ (ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్) హయాంలో అధ్యక్షుడి నుంచి లాగేసుకున్న అపారమైన అధికారాలను ఈ తీర్పు తిరిగి ఇచ్చింది. దాదాపు వందేళ్లుగా నలుగుతున్న ఈ వివాదంలో రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో విజయం సాధించాం. దేశాధ్యక్షుడికి అధికారాలు అత్యంత అవసరమైన ఈ సమయంలో, కోర్టు ఇచ్చిన అత్యంత ముఖ్యమైన తీర్పు ఇది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+