దుబాయ్‌ అతలాకుతలం .. 20 నిమిషాల్లో 7 భీకర దాడులు

దుబాయ్ లోని జెబెల్ అలీ ఇండస్ట్రీయల్ ఏరియాలో భీకర దాడులు జరిగాయి. 20 నిమిషాల్లోనే 7 భారీ దాడులతో ఆ ప్రాంతం దట్టమైన పొగతో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనను చిత్రీకరించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడులకు గల కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇరాక్ కు చెందిన మీడియా సంస్థలు.. యెమెన్ నుంచి దుబాయ్ వైపు మిసైల్స్ దూసుకొచ్చాయని ప్రచురిస్తోంది. యెమెన్ లోని హౌతీలే ఈ దాడులకు పాల్పడ్డాయని చెబుతోంది.

అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధంలో భాగంగా దుబాయ్ లోని జెబెల్ అలీ ఇండస్ట్రీయల్ ప్రాంతంపై దాడులు జరిగాయని పేర్కొంది. అయితే ఎమిరతీ మీడియా మాత్రం ఆ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేస్తోంది. ఈ దాడులకు సంబంధించిన అధికారిక వాస్తవాలు తెలియాల్సి ఉందని చెబుతోంది. ఇక మెహర్ అందించిన నాసా థెర్మల్ ఇమేజెరీ రిపోర్ట్ ప్రకారం.. జెబెల్ అలీ ఇండస్ట్రీయల్ ప్రాంతంలోని పోర్టుకు ఆనుకుని ఉన్న వేర్ హౌజ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి క్రమంగా విస్తరించసాగాయి. పోర్టు సమీపంలో చమురు నిల్వ, రవాణా చేసే వేర్‌ హౌజ్ వద్ద భారీగా మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదని తెలుస్తోంది.

dubai Fierce attacks in Jebel Ali Industrial Area 7 major attacks in 20 minutes dense smoke in area

ఈ ఘటన అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఆ ఇండస్ట్రీయల్ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయి ఉంది. ఇక జెబెల్ అలీ ప్రాంతం సౌత్ వెస్ట్ దుబాయ్ నగరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దుబాయ్ లోని కీలకమైన షాపింగ్ హబ్స్ లో ఇది ఒకటిగా చెబుతారు. ఇక్కడి నుంచి అంతర్జాతీయ పోర్టు సేవలు ఇతర దేశాలకు కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో దుబాయ్ లో హై అలర్ట్ ప్రకటించారు. అమెరికా కూటమి దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేపడుతున్న నేపథ్యంలో దుబాయ్ అప్రమత్తమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+