అఫ్గానిస్థాన్ కు అండగా భారత్.. 35 టన్నుల ఆహార సామాగ్రి చేరవేత
భారీ భూకంపాల ధాటికి అఫ్గానిస్థాన్ అట్టుడికి పోయింది. భూకంపం భారీ ప్రాణనష్టానికి దారితీసింది. భారీ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 1400 దాటినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్ అఫ్గానిస్థాన్ ప్రకటించింది. మరో 3 వేల మందికిపైగా గాయపడినట్లు సమాచారం. భారీ భూకంపాల ధాటికి ఇళ్లు మొత్తం ధ్వంసం అయ్యాయి. కూలిన ఇళ్ల శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోయి ఉండొచ్చని స్థానిక అధికారులు తెలిపారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే అప్గానిస్థాన్ లోని భూకంప బాధితులను ఆదుకునేందుకు భారత్ అత్యవసర మానవతా సాయాన్ని పంపించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
Indian earthquake assistance reaches Kabul by air.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 2, 2025
21 tonnes of relief materials including blankets, tents, hygiene kits, water storage tanks, generators, kitchen utensils, portable water purifiers, sleeping bags, essential medicines, wheelchairs, hand sanitizers, water… pic.twitter.com/q8TUb1wbSn
భారత్ అత్యవసర మానవతా సాయం అప్గానిస్థాన్ రాజధాని కాబూల్ కు చేరినట్లు విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ పేర్కొన్నారు. అంతకు ముందు 15 టన్నుల ఆహార సామాగ్రిని చేరవేయగా.. తాజాగా మరో 21 టన్నుల ఆహార సామాగ్రితోపాటు దుప్పట్లు, టెంట్లు, హైజీన్ కిట్స్, వాటర్ స్టోరేజీ ట్యాంకులు, జనరేటర్లు, కిచెన్ సామాగ్రి, అత్యవసర వైద్య పరికరాలు, ట్యాబ్లెట్లు, సానిటైజర్లు, వీల్ ఛైర్లు.. తదితర వస్తువులను చేరవేసినట్లు స్పష్టం చేశారు. అంతేకాక అప్గానిస్థాన్ పరిస్థితిని భారత్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింత సాయం భారత్ నుంచి ఉంటుందని స్పష్టం చేశారు.

అంతకుముందు అప్గానిస్థాన్ లో వరుస భూకంపాలపై భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అన్ని రకాలుగా సాయం చేస్తామని హామి ఇచ్చారు. అంతకుముందు బియ్యం, ఇతర ఆహార పదార్ధాలను అప్గానిస్థాన్ కు భారత్ పంపింది. ఇందుకు సంబంధించిన విషయాలను భారత్ విదేశాంగ శాఖ ఫొటోలను షేర్ చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. 1000 మందికి సరిపడా టెంట్లు పంపించామని.. అలాగే 15 టన్నుల ఆహార సామగ్రిని పంపించినట్లు పేర్కొంది. మరింత సహాయ సామగ్రిని పంపుతామని స్పష్టం చేసింది. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
-
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications