ఇండోనేషియా, జావాలో భారీ భూకంపం,రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఒక గంట వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి. తొలిసారిగా భూమి కంపించడంతో దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. ఇది జావా ద్వీపంలో సంభవించింది. గంట వ్యవధిలో మరో భూకంపం అదే తీవ్రతతో ఇండోనేషియాలో సంభవించింది. ఇది బాలి ద్వీపాన్ని తాకిందని యూరోపియన్ మెడిటెరేనియన్ భూకంప కేంద్రం తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఎక్కడా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
ఇండోనేషియాలో జనాభా 260 మిలియన్ ఉంది. ఇక ఆ దేశంలో భూకంపాలు సర్వసాధారణం. అంతేకాదు భారీ అగ్నిపర్వతాలు కూడా తరుచూ విస్ఫోటనం చెందడం దాన్నుంచి పొంగిపొర్లే లావా, పొగ సమీపప్రాంతాలను చుట్టుముట్టుతుండటం సాధారణంగా కనిపిస్తాయి. ఇక ఈ భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనంకు కారణం ఆ ప్రాంతం పసిఫిక్ తీరంలో ఉండటమే. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలుస్తారు.
Two magnitude 6.1 earthquakes in Indonesia in the last hour, clearly visible on our short period seismograph network from Queensland to Tasmania pic.twitter.com/ByU6gaUKQZ
— Seismology Centre (@AusQuake) September 19, 2019

ఈ ఏడాది మార్చిలో జావా ద్వీపంలో సంభవించిన భూకంపంలో నలుగురు మృతి చెందారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. 200కు పైగా ఇళ్లులు ధ్వంసమయ్యాయి. రాజధాని ప్రాంతం వరకు ఈ ప్రభావం కనిపించింది. గత నెలలో కూడా ఇండోనేషియాలో ఉదయం వేళల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications