Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారీ భూకంపం- 3 రోజుల్లో రెండోసారి

Afghanistan earthquake 2025: పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ ఈశాన్య ప్రాంతాన్ని వణికించింది. తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఈ స్థాయిలో భూమి ప్రకోపించడం మూడు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఈ నెల 16వ తేదీన అక్కడ భూమి కంపించింది.

ఇటీవలే మయన్మార్, థాయ్‌లాండ్‌లల్లో సంభవించిన భూకంపాలు మిగిల్చిన విషాదాన్ని ఇంకా విస్మరించకముందే భూమి ప్రకంపించడం ఉలిక్కిపడేలా చేసింది. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల పాకిస్తాన్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. దీని తీవ్రత ఇటు భారత్‌పైనా పడింది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో తేలికపాటి ప్రకంపనలు కనిపించాయి.

Earthquake today A magnitude 5 8 rocks Afghanistan

ఈ భూకంపం వల్ల వల్ల ప్రాణ, ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు సమాచారం లేదు. కొన్ని ప్రాంతాల్లో నివాసాలు బీటలు వారినట్లు వార్తలు అందుతున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా రికార్డయింది. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12:17 నిమిషాలకు ఆఫ్ఘనిస్తాన్ 36.10 ఉత్తర అక్షాంశం, 71.20 తూర్పు రేఖాంశ వద్ద భూమి కంపించింది.

ఉపరితలం నుంచి 130 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. రాజధాని కాబుల్‌కు ఈశాన్య దిశగా ఉన్న బదాక్షన్ ప్రావిన్స్ పరిధిలోని మాఘ్ నువుల్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది.

పాకిస్తాన్‌తో సరిహద్దులను పంచుకుంటోన్న ప్రావిన్స్ ఇది. ఫలితంగా అటు పాకిస్తాన్, దానికి ఆనుకునే ఉన్న జమ్మూ కాశ్మీర్‌లల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు.

శ్రీనగర్‌లో స్థానికులు భయాందోళనలతో ఇళ్లు, కార్యాలయాలు, షాపుల నుంచి బయటికి పరుగెత్తారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు. చాలా సేపటి వరకు రోడ్ల మీదే గడిపారు.

భూకంపం వల్ల ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. ఈ ప్రావిన్స్ రాజధాని ఫైజాబాద్‌లో పలు నివాసాలు బీటలు వారినట్లు సమాచారం. భూకంపాలు సంభవించే అవకాశం అత్యధికంగా ఉండే దేశాలతో కూడిన రింగ్ ఆఫ్ ఫైర్లో ఆఫ్ఘనిస్తాన్ లేదు.

అయినప్పటికీ- ఈ మధ్యకాలంలో ఇక్కడ తరచూ భూమి ప్రకంపిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుంది ఆఫ్ఘన్. కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్.. రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+