ట్విట్టర్ దెబ్బకు నిండా మునిగిన ఎలాన్ మస్క్‌

వాషింగ్టన్: అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు సినిమా కష్టాలు మొదలయ్యాయి. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్‌, ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అధిపతిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్‌ ఇప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి టెస్లాలో తనకు ఉన్న వాటాల్లో కొంత మొత్తాన్ని అమ్ముకోవాల్సి వచ్చిందంటే.. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

దీనికి కారణాలు లేకపోలేదు. టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌తో న్యాయపోరాటం చేయాల్సి వచ్చినందున దానికి అయ్యే ఖర్చుల కోసమే ఈ షేర్లను విక్రయించినట్లు ఎలాన్ మస్క్ చెప్పారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. 6.9 బిలియన్ డాలర్ల విలువ చేసే టెస్లా షేర్లను విక్రయించినట్లు తెలిపారు. ట్విట్టర్‌తో ఏర్పడిన న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించడానికి దీన్ని వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

టెస్లాలో మొత్తంగా ఎలాన్ మస్క్‌కు 155.04 మిలియన్ల షేర్లు ఉన్నాయి. అందులో ఈ మొత్తాన్ని విక్రయించాడు. టెస్లా షేర్లను అమ్ముకోవడం ఇది రెండోసారి. ఇదివరకూ ఆయన తన స్టేక్స్‌ను అమ్మాడు. దీనితో ఇప్పటివరకు టెస్లాలో తనకు ఉన్న వాటా విలువ 32 బిలియన్ డాలర్ల మేర తగ్గించుకున్నట్టయింది.

Elon Musk sold nearly $7 billion worth of Tesla shares, here is the reason

44 బిలియన్ డాలర్ల విలువ చేసే ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాలను ఎలాన్ మస్క్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ట్విట్టర్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించినప్పటి నుంచీ ఎలాన్ మస్క్ దాని మీద అనేక రకాల కొర్రీలు పెడుతూ వచ్చారు. స్పామ్, ఫేక్ అకౌంట్ల వివరాలను అందజేయాలనీ ఆదేశించాడు. దీనిపై ట్విట్టర్ యాజమాన్యం నుంచి సరైన సమాధానం లభించినప్పటికీ.. ఎలాన్ మస్క్ దాన్ని అంగీకరించలేదు. మరిన్ని కొర్రీలను పెట్టారు.

Recommended Video

    NASA అంతరిక్షంలోకి Athira Preeta Rani... ఎవరీమె? *Trending | Telugu OneIndia

    అవి తేలేంత వరకూ డీల్ ముందుకు వెళ్లదనీ ప్రకటించారు. కొద్దిరోజుల తరువాత- ఈ టేకోవర్ ఒప్పందాలను పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. స్పామ్, ఫేక్ అకౌంట్స్‌పై ట్విట్టర్ యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాలేదని వ్యాఖ్యానించారు. ఈ డీల్ రద్దయిన తరువాత- ట్విట్టర్ యాజమాన్యం ఎలాన్ మస్క్‌పై ఎదురుదాడికి దిగింది. ఆయనపై న్యాయపోరాటానికి దిగింది. పెనాల్టీని చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. పరువునష్టం దావానూ వేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+