రూ.471 కోట్లకు జబాంగ్‌ను కొనుగోలు చేసిన ఫ్లిప్‌కార్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో సంస్థను కొనుగోలు చేసింది. జబాంగ్‌ను 70 మిలియన్ డాలర్లకు అంటే దాదాపు రూ.471 కోట్లకు కొనుగోలు చేసింది. జబాంగ్ మాతృ సంస్థ గ్లోబల్ ఫ్యాషన్ గ్రూప్. 2014లో ఫ్లిప్‌కార్ట్ మింత్రను కొనుగోలు చేసింది.

జ‌బాంగ్ దేశంలోనే రెండో అతిపెద్ద ఆన్‌లైన్ ఫ్యాష‌న్ రీటెయిల‌ర్. దీనిని ఫ్లిప్‌కార్ట్ సొంతం చేసుకోవడం గనార్హం. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం ఆ సంస్థ ప్ర‌క‌టించింది. రెండేళ్ల కింద‌ట తాము కొనుగోలు చేసిన మింత్ర ద్వారా జ‌బాంగ్‌ను సొంతం చేసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

Flipkart’s Myntra acquires Jabong for $70 million

భార‌త్‌లో ఈ కామ‌ర్స్ బిజినెస్ అభివృద్ధిలో ఫ్యాష‌న్‌, లైఫ్‌స్టైల్ త‌మదైన పాత్ర పోషించాయ‌ని, అందుకే తాము ఈ రంగానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని ఫ్లిప్‌కార్ట్ సీఈవో, కో ఫౌండ‌ర్ బిన్నీ బ‌న్స‌ల్ వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఈ కామ‌ర్స్ బిజినెస్‌లో త‌న‌దైన ముద్ర వేసిన ఫ్లిప్‌కార్ట్‌.. మింత్రా, జ‌బాంగ్ ద్వారా కోటి 50 ల‌క్ష‌ల మంది కొత్త యూజ‌ర్ల‌ను త‌మ ఖాతాలో వేసుకుంది.త

జ‌ర్మ‌నీకి చెందిన రాకెట్ ఇంట‌ర్నెట్ గ్రూప్ ఇన్నాళ్లూ జబాంగ్‌ను న‌డిపించింది. రెండేళ్ల నుంచి దానినిఅమ్మేందుకు య‌త్నిస్తోంది. మొద‌ట అమెజాన్‌, పేటీఎమ్‌తో చ‌ర్చ‌లు జ‌రిపినా అవి ఫ‌లించ‌లేదు. రెండేళ్ల కింద‌టే జ‌బాంగ్‌ను 40 కోట్ల డాల‌ర్ల‌కు అమ్మ‌కానికి పెట్టింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
E-commerce giant Flipkart makes its second big acquisition, buying out Jabong for $70 million (approximately Rs. 471 crore) in cash, according to Jabong parent-company Global Fashion Group.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి