కెనడా పాఠశాలలో కాల్పులు: నలుగురు మృతి
ఒట్టావా: కెనడాలోని సాస్కెచెవాన్ సమీపంలోని లాలొచెలో ఓ పాఠశాలపై దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కాల్పుల ఘటనతో పాఠశాలలోని విద్యార్థులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ విషయాన్ని స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడు ధృవీకరించారు. అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కెనడా ప్రధాని సానుభూతి తెలిపారు.

స్కూల్‌లో బాంబు పేలుడు
అంకారా: టర్కీలోని ఓ పాఠశాలలో శనివారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కొందరు గుర్తు తెలియని దుండగులు బాంబు దాడులకు పాల్పడ్డారు. టర్కీ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ కొంత కాలంగా కుర్దిష్ మిలిటెంట్లు స్కూళ్లపై దాడికి పాల్పడుతున్నారు.












Click it and Unblock the Notifications