ఇజ్రాయెల్ మారణ హోమం: 115 మంది దుర్మరణం

Israel: గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌పై మరోసారి విరుచుకుపడింది ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించడానికి కొన్ని గంటల ముందు మారణ హోమాన్ని సృష్టించిందక్కడ. డ్రోన్ దాడులతో కల్లోలాన్ని రేపింది. ఈ ఘటనలో 115 మంది దుర్మరణం పాలయ్యారు.

మృతుల్లో 31 మంది మహిళలు, 28 మంది పిల్లలు ఉన్నారు. 265 మంది గాయపడ్డారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ అధికార ప్రతినిధి మహ్మద్ బసుల్ తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

Gaza As Airstrikes Continued Hours Surrounding Ceasefire

నిజానికి- హమాస్‌తో ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇజ్రాయెల్. దీనికి ప్రతిగా ఆ మిలిటెంట్ గ్రూప్ చెరలో బందీలుగా ఉన్న తమ దేశ పౌరులను విడిపించుకోవాలనేది షరతు. దీనికి ఇరు పక్షాలు అంగీకరించాయి. కాల్పుల విరమణను కుదుర్చుకున్నాయి.

ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదించడానికి కొన్ని గంటల ముందు ఈ గగనతల దాడులు సాగాయి. గాజా ఉత్తరప్రాంతంలోని షేక్ రంద్వాన్‌పై ప్రధానంగా ఈ డ్రోన్ దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 115 మంది పాలస్తీనియన్లు దుర్మరణం పాలయ్యారని మహ్మద్ బసుల్ చెప్పారు. గాజా చరిత్రలో డెడ్లియెస్ట్‌గా అభివర్ణించారు.

గాయపడ్డ వారిని అల్- అరబ్ అహ్లి, బాప్టిస్ట్ ఆసుపత్రులకు తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తోన్నట్లు పాలస్తీనియన్ రెడ్ క్రీసెంట్ సొసైటీ వెల్లడించింది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుని కూడా ఇజ్రాయెల్ అత్యంత అమానవీయంగా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మహ్మద్ బసుల్ విమర్శించారు. వారం రోజులుగా దాదాపుగా హమాస్‌కు చెందిన 50కి పైగా స్థావరాలపై ఇజ్రాయెల్ క్రమం తప్పకుండా దాడులు సాగించినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+