నరకంలా మారిన గాజా.. ఇజ్రాయెల్ దాడుల్లో 72 మంది మృతి!

Israel Attack: ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొంటున్న గాజాలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ కాల్పులు, దాడుల్లో దాదాపు 72 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. అదే సమయంలో గత 72 గంటల్లో 21 మంది గాజాలోని పిల్లలు ఆకలితో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నెలన్నర శిశువు కూడా ఉన్నాడు. గాజాలో 21 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో మునుపటి కంటే పోషకాహార లోపం పాలస్తీనియన్ల ప్రాణాలను వేగంగా హరిస్తోంది. యూఎన్ ఏజెన్సీ గాజాను నరకంతో పోలుస్తూ.. ప్రజలు జీవించాలనే ఆశలు కూడా కోల్పోతున్నారని పేర్కొంది.

పాలస్తీనా ఆరోగ్య అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఘర్షణల్లో గాజాలో దాదాపు 101 మంది ఆకలితో చనిపోయారు. వీరిలో 80 మంది పిల్లలు ఉన్నారు. వీటిలో ఎక్కువ మరణాలు ఇటీవలి వారాల్లో సంభవించాయి. గాజాకు సహాయ సరఫరాపై ఇజ్రాయెల్ నియంత్రణ ఉంది. ఇజ్రాయెల్ గాజాలోని జనాభాకు సాయం అందకుండా అడ్డుకోవడంతో ప్రాథమిక అవసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది.

Gaza Turns into Hell 72 Dead in Israeli Attacks Hunger Claims 21 Children in 72 Hours

ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు..
ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీ (UNRWA) అధిపతి మంగళవారం గాజా పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, 'మా సిబ్బంది, వైద్యులు, మానవతా కార్యకర్తలు ఆకలి, అలసట కారణంగా విధుల్లో ఉండగానే స్పృహ కోల్పోతున్నారు. గాజాలోని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, దీనిని 'భూమిపై నరకం' అని మాత్రమే పిలవగలం' అని అన్నారు. ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీ అంచనా ప్రకారం.. మే చివరి నుంచి ఇప్పటివరకు ఆహారం కోసం వెతుకుతున్న 1,000 మంది ఆకలితో మరణించారు. సహాయ కేంద్రాల వద్ద ఆహారం కోసం వచ్చిన గుంపుపై కాల్పులు జరపడం గతంలో ఎన్నడూ చూడలేదని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీకి చెందిన ఫిలిప్ లాజరిని అన్నారు.

ప్రతి ఇంటి తలుపు తడుతున్న ఆకలి
గాజాలో ఆకలి ప్రతి ఇంటి తలుపు తడుతోందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ మంగళవారం అన్నారు. మానవతా సూత్రాలపై ఆధారపడిన మానవతా వ్యవస్థ చివరి శ్వాస తీసుకోవడం మేము చూస్తున్నామని ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అన్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాట్లాడుతూ, ఇజ్రాయెల్ సైన్యం సోమవారం డీర్ అల్ బలాలోని తన సిబ్బంది నివాసం, ప్రధాన గోదాముపై దాడి చేసిందని పేర్కొంది. తన సిబ్బంది నివాసంపై మూడుసార్లు దాడి జరిగిందని, ఈ దాడుల వల్ల మంటలు చెలరేగి భారీ నష్టం వాటిల్లిందని డబ్ల్యూహెచ్వో తెలిపింది.

ప్రపంచ విజ్ఞప్తిని పక్కన పెట్టిన ఇజ్రాయెల్
గాజాలో పౌరుల హత్యలు, సహాయాన్ని నిలిపివేయడంపై ఇజ్రాయెల్ కు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రపంచ దేశాలు, సంస్థలు ఇజ్రాయెల్‌ను దాడులను నిలిపివేయాలని, గాజాకు సహాయాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ప్రపంచమంతా విజ్ఞప్తి చేస్తున్నా ఇజ్రాయెల్ కనీసం కనికరం చూపించడం లేదు. ఇజ్రాయెల్ గాజాపై నిరంతరం దాడులు చేస్తోంది. కానీ గాజాకు మానవతా సహాయాన్ని బదిలీ చేయడం అత్యంత ముఖ్యమైనదిగా తాము భావిస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది గాజాకు సహాయాన్ని అడ్డుకుందని వచ్చిన ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+