దారుణం: బాలికపై 38 మంది రేప్, మరో యువతిపైనా..
కౌలాలంపూర్: మలేషియాలోని ఉత్తర కెలాంటన్ రాష్ట్రంలో మే 20న దారుణం జరిగింది. స్నేహితురాలిని కలిసి ఇంటికి వస్తున్న 15ఏళ్ల బాలికపై 38 మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెతోపాటు మరో 17 ఏళ్ల స్నేహితురాలిపై సైతం ఈ ఆకృత్యాన్ని కొనసాగించారు.
ఈ దారుణానికి పాల్పడిన నిందితులలో 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన 25 మంది కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులకు సుమారు 30 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. దీంతోపాటు కొరఢా దెబ్బలు తినాల్సి ఉంటుంది.

కాగా, మలేషియాలో రోజు రోజుకు పెరిగిపోతున్న అత్యాచారం కేసులతో ఇక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులను మరింత కఠినంగా శిక్షించాలని బాధితులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా మలేషియాలో 2012 సంవత్సరంలో 3వేల అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోని బాధితుల్లో 52శాతం మంది 16 అంతకంటే తక్కువ వయస్సున్న వారే ఉన్నారని పోలీసు గణాంకాలు తెలుపుతున్నాయి.












Click it and Unblock the Notifications