ముంబై మారణకాండ మాస్టర్‌మైండ్‌ హఫీజ్ కాల్చివేత?

Hafeez Saeed: ముంబై మారణకాండ.. దేశ ఆర్థిక రాజధానిపై 2008లో చోటు చేసుకున్న ఈ ఉగ్రవాద దాడి.. ప్రపంచం మొత్తాన్నీ నివ్వెరపోయేలా చేసింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ప్రోత్సాహిత లష్కరే తొయిబాకు చెందిన తొమ్మిదిమంది సూసైడ్ స్క్వాడ్ నిర్వహించిన ఈ దాడుల్లో 180 మందికి పైగా సాధారణ పౌరులు, పోలీసులు మరణించారు. పలువురు గాయపడ్డారు.

తాజ్ హోటల్, ట్రైడెంట్ ఓబెరాయ్, ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, లెపార్డ్ కేఫ్, రెండు ఆసుపత్రులు, నారిమన్ హౌస్ వంటి ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులు జరిపారు. ఈ మారణహోమానికి ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దౌలా చీఫ్ హఫీజ్ సయీద్. ముంబైపై దాడి చేయడానికి లష్కరే తొయిబాకు పెద్ద ఎత్తున నిధులను సమకూర్చాడు. ఆయుధాలను సమకూర్చాడు.

ఇప్పుడదే ఉగ్రవాది, ముంబై మారణహోమం మాస్టర్‌మైండ్ హఫీజ్ సయీద్ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని ఓ వ్యక్తి అతనిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో హఫీజ్ సయీద్‌తో పాటు అతని అనుచరుడు ఫైజల్ నదీమ్ అలియాస్ అబు ఖాతిల్ మరణించినట్లు సమాచారం.

Hafiz Saeed Pakistan

పాకిస్తాన్‌లో జీలం టౌన్‌లో ఈ ఘటన సంభవించింది. దీన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించట్లేదు. రాజా మునీబ్ అనే ఓ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. జీలంలో కార్ప్స్ కమాండ్ మంగ్లాతో సమావేశమైన అనంతరం తిరిగి వస్తోండగా మార్గమధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అతని కారుపై కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలతో హఫీజ్‌తో పాటు అతని ప్రధాన అనుచరుడు అబు ఖాతిల్ తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్న వారిద్దరినీ రావల్పిండిలోని కంబైన్డ్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారని, దీన్ని అధికారికంగా ఇంకా ఎవరూ ధృవీకరించలేదని వెల్లడించారు.

హఫీజ్ సయీద్ చీఫ్‌గా వ్యవహరిస్తోన్న జమాత్-ఉద్-దవాపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం కొనసాగుతోంది. ఐక్యరాజ్యసమితి సైతం అతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ఇదివరకే ప్రకటించింద. లష్కరే తొయిబా, జైషె మహ్మద్ వంటి ఉగ్రవాద గ్రూపులు, సంస్థలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నాడనే కారణంతో- పాకిస్తాన్ ప్రభుత్వంపై కూడా జమాత్-ఉద్-దవాపై ఆంక్షలను విధించింది. 2022లో అరెస్ట్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+