ఇజ్రాయెల్- గాజా సీజ్ ఫైర్.. 20 మంది బందీలు విడుదల..
ఇజ్రాయెల్- హమాస్ మధ్య అక్టోబర్ 13,2025 న జరిగిన శాంతి ఒప్పందంలో భాగంగా 20 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసింది. అక్టోబర్ 7,2023 నుంచి వీళ్లు గాజాలో బందీలుగా ఉన్నారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్ లో ఉన్న దాదాపు 1,900 నుంచి 2,000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. వీరిలో 250 మంది వరకు కఠిన కారాగార, యావజ్జీవ శిక్ష పడిన వాళ్లు ఉన్నారు. మరో 1,700 మందికిపైగా పౌరులను యుద్ధ సమయంలో అదుపులోకి తీసుకున్నారు. వీరందిరినీ ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్ లో ఇక యుద్ధ వాతావరణం ముగిసినట్లేనని సంకేతం ఇచ్చారు. అయితే ఇప్పుడు గాజాను ఎవరు అదుపులోకి తీసుకుంటారు అన్న ప్రశ్నకు సమాధానం కావాల్సి ఉంది.
అక్టోబర్ 13,2025 న జరిగిన శాంతి ఒప్పందంలో భాగంగా 20 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసింది. తొలి విడతగా ఏడగురిని విడుదల చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో 13మంది విడుదల చేసింది. దీనికి బదులుగా మొత్తం 2వేలమందికిపైగా బందీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. వెస్ట్ బ్యాంక్, గాజాలో సందడి నెలకొంది. ఖైదీలను బస్సుల్లో తీసుకొస్తున్న క్రమంలో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే హమాస్ బందీలుగా ఉన్న 20 మంది విడుదల అయి స్వదేశానికి వస్తున్న క్రమంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ లో సందడిగా ఉంది.
ఇక గాజా శాంతి ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు కీలక పాత్ర పోషించారు. యుద్ధం ముగిసిన తర్వాత ట్రంప్ ఇజ్రాయెల్ లో పర్యటించారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో కీలక ప్రసంగం చేశారు. ట్రంప్ తో పాటు అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన కృషికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్, ఇజ్రాయెల్ కు అమెరికా రాయబారి మైక్ హకబీ ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆ దేశ ప్రధాని నెతన్యాహు అందజేశారు. ట్రంప్ భవిష్యత్తులో నోబెల్ శాంతి బహుమతిని అందుకుంటారని నెతన్యాహు ఆశాభావం వ్యక్తం చేశారు.
గాజాలో శాంతిని నెలకొల్పడమే కాకుండా.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు కారణమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు.. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో స్టాండింగ్ ఓవేషన్ దక్కింది. కొన్ని నిమిషాల పాటు అందరూ నిలబడి చప్పట్లతో ట్రంప్ ను ఆహ్వానించారు. ప్రపంచానికి మరింత మంది ట్రంప్ లు అవసరం అంటూ ట్రంప్ ను ఆకాశానికి ఎత్తారు. ట్రంప్ మాట్లాడుతూ.. శాంతిని నెలకొల్పడంతో తమకు సహకరించినందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్ లో ఇకపై గోల్డెన్ ఏజ్ ప్రారంభం అయిందని ట్రంప్ పొగడ్తల్లో ముంచారు.

2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసింది. ఈ దాడిలో 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని బందీలుగా చేసి గాజాకు తీసుకెళ్లింది. వారిలో కొంతమందిని హమాస్ విడుదల చేసింది. అయితే మరికొంత మందిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. చాలా మంది మరణించారు. వారిలో 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నారు. వారిని తాజాగా విడుదల చేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications