ఘోరం: అలబామాలో కాల్పులు: ఏడుగురు సజీవ దహనం
వాషింగ్టన్: అమెరికాలోని అలబామా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
అలబామా రాష్ట్రంలోని వాల్హెర్ మోసో స్ప్రింగ్స్‌లోని ఓ ఇంట్లో ఏడుగురు వ్యక్తులు మంటల్లో సజీవదహనమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ఏర్పడిన మంటల్లో వీరంతా మరణించారు.
మంటల ధాటికి ఇల్లు కూడా కాలిపోయింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆ ఇల్లు మంటల్లో కాలిపోతోంది.

వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చి.. లోనికి వెళ్లి చూడగా అప్పటికే ఆ ఇంట్లో ఏడుగురు చనిపోయి ఉన్నారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ పెంపుడు కుక్క కూడా మరణించిందని చెప్పారు.
ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారు? ఎందుకు పాల్పడ్డారు? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులంతా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో నిందితులను ఎవరూ చూడలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications