వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాతి యుగంలో మనుషులు ఎలా మాట్లాడుకునేవారు? పేర్లు, వేర్వేరు తెగలు, భాషలు ఉండేవా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రాతి యుగం

రాతి యుగం సుమారు 30 లక్షల ఏళ్ల కిందటి నుంచి 40,000 ఏళ్ల క్రితం వరకు కొనసాగి ఉండవచ్చు.

ఆ యుగంలోని మన పూర్వీకులు ఉపయోగించిన తొలి పరికరాలను రాతితో తయారు చేసుకుని వినియోగించడం వల్ల ఆ కాలానికి రాతి యుగమనే పేరొచ్చింది.

రాతి యుగం మొదలైన చాలా కాలం తర్వాత, అంటే సుమారు 2,00,000 సంవత్సరాల క్రితం మన లాంటి మనుషులు, హోమో సేపియన్‌లు కనిపించడం మొదలుపెట్టారు.

నరజాతిగా పరిణామం చెందుతున్న దశలో రకరకాల వానర జాతులు పెద్ద పెద్ద రాళ్ళ నుంచి పదునైన రాళ్లను కొట్టి సరళమైన పరికరాలను చేసుకోవడం మొదలుపెట్టిన కాలంలో రాతి యుగం మొదలైందని చెప్పొచ్చు.

ఈ వానరాలు కాస్త వంగి నడిచేవి. కానీ, వీటి చేతులు మాత్రం పరికరాలు రూపొందించేందుకు వీలుగా ఉండేవి.

ఈ తొలి దశలో ఉన్న వానరాలకు చింపాంజీల మాదిరిగా కాకుండా చిన్న మెదడు ఉండేది. వీళ్ళు మాట్లాడేవారు కాదు.

రాతి యుగం తర్వాతి దశలో నిటారుగా నడిచే వానరాలు పుట్టుకొచ్చాయి. వీటిని హోమోహబిలీస్, హోమోఎరక్టస్ అనే పేర్లతో పిలిచేవారు.

మనలాంటి మనుషుల రాకకు ముందు ఈ జాతులు ఆఫ్రికాలో సుమారు 10 లక్షల నుంచి 20 లక్షల సంవత్సరాల క్రితం ఉండేవి.

వీటికి అంతకు ముందు వంగి నడిచే వానరాల మెదడు కంటే కూడా కాస్త పెద్ద మెదడు ఉండేది. కానీ, మానవుల మెదడు కంటే కాస్త చిన్నవే ఉండేవి. మనుషులకున్నన్ని తెలివితేటలు వీటికి ఉండేవి కావు. ఇవి కూడా మాట్లాడేవి కాదు. కానీ, కొన్ని రకాల శబ్దాలు చేసేవి.

సుమారు 400,000 ఏళ్ల క్రితం పెద్ద మెదడు ఉన్న మూడు రకాల జాతులు మనుగడలో ఉండేవి. వీరే నియాండర్తల్స్‌, డెనీసోవన్స్ , తొలి దశ హోమోసేపియన్లు.

రాతి యుగం తర్వాతి దశలో నిటారుగా నడిచే వానరాలు పుట్టుకొచ్చాయి.

నియాండర్తల్స్, డెనీసోవన్స్ ఆఫ్రికాకు అవతల యూరేషియాలో ఉండేవారు.

డెనీసోవన్స్ గురించి పెద్దగా సమాచారం లేదు. కానీ, సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం నియాండర్తల్స్‌ రాతి పరికరాలతో పాటు చెక్కతో చేసిన బాణాలు, లేడి లాంటి జంతువుల ఎముకలతో చేసిన చిన్న చిన్న పరికరాలను వాడేవారు.

వీళ్ళకుండే పెద్ద మెదడు వల్ల రాతితో పాటు ఇతర పదార్ధాలతో కూడా పరికరాలను తయారు చేసి ఉంటారని కొంత మంది భావిస్తారు.

నియాండర్తల్స్‌ మాట్లాడగలిగేవారు. కానీ, ఇది కేవలం ఊహ మాత్రమే. ఆఖరు నియాండర్తల్స్ సుమారు 40,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయారు.

ఆధునిక మానవులు గుహల గోడల పై చిత్రాలను కూడా చిత్రించారు.

ఆధునిక మానవులు

తొలి దశ మానవులు ఆఫ్రికాలో నివసించేవారు. సుమారు 2,00,000 సంవత్సరాల క్రితం తొలి హోమో సేపియన్లు ఆధునిక మానవులుగా పరిణామం చెందారు.

ఈ ఆధునిక మానవులు తెలివైన వారు. వీళ్ళు నేడు మనం మాట్లాడుకుంటున్న విధంగానే మాట్లాడుకునేవారు. హోమో సేపియన్లు అంటే తెలివైన మనుషులని అర్ధం.

మలి రాతి యుగంలో సుమారు 60,000 సంవత్సరాల క్రితం, ప్రజలు ఆఫ్రికా దాటి వెళ్లి ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో వ్యాప్తి చెందారు.

మొదట్లో, హోమోసేపియన్లు కూడా రాతి పరికరాలను మాత్రమే వాడేవారు. కానీ, మాట్లాడగలిగే సామర్ధ్యం ఉండటంతో వారి జ్ఞానాన్ని ఒకరితో ఒకరు పంచుకునే అవకాశం కలిగింది.

క్రమేపీ, వాళ్ళు రాళ్లు, చెక్క, ఎముకలు, జంతువుల చర్మంతో పరికరాలను తయారు చేయడం నేర్చుకున్నారు.

వీళ్ళు దుస్తులు, చెప్పులు ధరించేవారు. నివాసాలను ఏర్పరుచుకున్నారు. ఆహారం కోసం సామూహికంగా వేటకు వెళ్లేవారు. 40,000 సంవత్సరాల క్రితం, లేదా అంత కంటే ముందు ఆధునిక మానవులు గుహల గోడలపై చిత్రాలను కూడా చిత్రించారు.

ఆధునిక యుగంతో పోలిస్తే రాతి యుగంలో అతి తక్కువ భాషలు మాత్రమే ఉండేవి. కానీ, భాష ఆధునిక భాష మాదిరిగానే ఉండి ఉండొచ్చు.

ప్రజలు వాచకాలు, నామవాచాకాలతో కూడిన వ్యాఖ్యాలను మాట్లాడి ఉంటారు. కానీ, పదాల వాడకం మాత్రం వేర్వేరుగా ఉండి ఉండొచ్చు. ఉదాహరణకు జపనీస్ భాషలో వాడే పదాలు ఇంగ్లీష్ భాషలో వాడే పదాలకు భిన్నంగా ఉంటాయి.

వివిధ భాషలు

వివిధ తెగలు మాట్లాడుకునే భాషలు వేర్వేరుగా ఉండి ఉండొచ్చు. ఒక జాతి వారు మరొక జాతితో మాట్లాడటం కష్టంగా ఉండి ఉంటుంది. మనం విదేశాలకు వెళ్ళినప్పుడు అవతలి వారి భాష రానప్పుడు ఇలాంటి సమస్యే ఎదురవ్వడం చూస్తూ ఉంటాం.

కానీ, భాషలో ప్రస్తుతం ఉన్న పదాల కంటే కూడా చాలా తక్కువ పదాలు ఉండి ఉండొచ్చు. వాళ్లకు టీవీ, కార్, కంప్యూటర్ లాంటి పదాలను వాడాల్సిన అవసరం రాలేదు. అమ్మ, నాన్న, అక్క, అన్న, తమ్ముడు లాంటి పదాలు ఉండే ఉంటాయి.

కానీ, ఆధునిక మానవులకు 2,00,000 సంవత్సరాల క్రితం లెక్కలు తెలిసి ఉండొచ్చు.

జంతువులకు, మొక్కలకు పేర్లు పెట్టి ఉంటారు. ప్రణాళికలు చేసి ఉంటారు. దయ చేసి, ధన్యవాదాలు లాంటి పదాలు కూడా తెలిసి ఉంటాయి. మనుషులకు కూడా పేర్లు ఉండి ఉంటాయి.

తొలి దశ ఆధునిక మానవులు మనం మాట్లాడుకునే మాదిరిగానే తిండి, స్నేహితుల గురించి మాట్లాడుకుని ఉండి ఉంటారు.

తల్లి తండ్రులు తమ పిల్లల గురించి మాట్లాడుకునేవారు. పిల్లలు ఒకరితో ఒకరు ఆడుకుని, మాట్లాడుకుంటూ ఉండి ఉండేవారు.

వాళ్లలో వాళ్ళు పాటలు కూడా పాడుకుని ఉంటారు.

వాళ్ళు రాతి యుగానికి చెందిన వారే కావచ్చు. కానీ, భాష విషయానికొచ్చేసరికి మాత్రం వాళ్ళు ఆధునికులని చెప్పవచ్చు.

మార్క్ పేగెల్ యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ లో ఇవల్యూషనరీ బైయాలజీ ప్రొఫెసర్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How did people talk in the stone age? Were there names, different tribes, languages?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X