పాకిస్థాన్, చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తమ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అనేక దేశాలు తమ ఆయుధ సంపత్తిని మరింత పెంచుకునేందుకు సిద్దం అవుతున్నాయి. ఇక భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. భారత నేవీ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. మోస్ట్ అడ్వాన్స్ డ్ స్టీల్త్ ఫ్రిగేట్ రంగానికి చెందిన INS తమాల్ యుద్ధ నౌక సేవలను ప్రారంభించనుంది. జులై 1, 2025 నుంచి ఈ యుద్ధ నౌక గస్తీ నిర్వహించనుంది.
భారత నేవీ రంగంలో కీలక ముందడుగు పడింది. అత్యాధునిక స్టీల్త్ ఫ్రిగేట్ రంగానికి చెందిన INS తమాల్ యుద్ధ నౌక భారత అమ్ముల పొదిలో చేరనుంది. జులై 1, 2025 నుంచి ఈ యుద్ధ నౌక సేవలు ప్రారంభించనుంది. ఈ యుద్ధ నౌకను రష్యా అభివృద్ధి చేసింది. భారత్- రష్యా ఒప్పందంలో భాగంగా రష్యాలోని యాంతార్ షిప్ యార్డ్ లో ఈ నౌక నిర్మాణం జరిగింది. 2016 భారత్- రష్యా మధ్య రూ. 21,000 కోట్ల రక్షణ రంగ డీల్ కుదిరింది.
హిందూ మహా సముద్రంలో గస్తీని పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఈ మేరకు రష్యాతో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. డీల్ లో భాగంగా రష్యా భారత్ కు ఈ INS తమాల్ సిరీస్ కు చెందిన యుద్ధ నౌకలను నిర్మించి అందించింది. జులై 1 నుంచి ఈ యుద్ధ నౌక గస్తీ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. వైస్ అడ్మిరల్ సంజయ్ జే సింగ్ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

INS తమాల్ యుద్ధ నౌక భారత నౌకాదళానికి చెందిన తల్వార్ -క్లాస్ ఫ్రిగేట్. ఇది తల్వార్- క్లాస్ ఫ్రిగేట్ విభాగంలో ఎనిమిదో నౌక. అంతేకాక భారత నేవీ.. రష్యా నుంచి ఆర్డర్ చేసిన క్లాస్ ఫ్రిగేట్ లో మూడో బ్యాచ్ లో రెండోది. రష్యా కాలినిన్ గ్రాడ్ లోని యాంతార్ షిప్ యార్డ్ ఈ నౌకను నిర్మించింది. ఈ నౌక భారత నావికాదళం దిగుమతి చేసుకున్న చివరి యుద్ధనౌక కావడం విశేషం. అంతకుముందు డిసెంబర్ 2024లో INS తుషీల్ ను రష్యా అప్పగించింది.












Click it and Unblock the Notifications