Video: మెట్రోలో రక్తపు వాంతులు, ప్రపంచాన్ని కదిలించిన దృశ్యం!

కఠినమైన అనారోగ్యం.. కడుపు నిండా కష్టం.. అయినా సడలని ఆత్మవిశ్వాసం, అంతకుమించిన సామాజిక బాధ్యత. చైనాకు చెందిన 23 ఏళ్ల యువతి 'హు జిన్యావో' గాథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కళ్లను చెమ్మగిల్లేలా చేస్తోంది. మెట్రో రైలులో ఆమె చేసిన ఒక చిన్న పని, మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిచెప్పడమే కాకుండా, ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆ హృదయ విదారక, స్ఫూర్తిదాయక కథనం..

మార్చి 23న చైనాలోని చోంగ్‌క్వింగ్ మెట్రో రైలులో ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక యువతి తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ, అకస్మాత్తుగా రక్తం కక్కుకుంది. సాధారణంగా ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే ప్రాణభయంతో వణికిపోతారు. కానీ, హు జిన్యావో మాత్రం తన ఆరోగ్యం కంటే తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలగకూడదని భావించింది. కనీసం నిలబడలేని స్థితిలో కూడా తన కోటు తీసి, రైలు ఫ్లోర్ పై పడిన తన రక్తపు మరకలను స్వయంగా తుడుచుకుంది. ఈ దృశ్యాన్ని ఒక ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా దావానంలా వ్యాపించింది.

Inspirational Story Ailing Woman Who Cleaned Her Own Blood on Metro Wins Hearts and Rs 3 Crore in Donations

అరుదైన వ్యాధి.. అలుపెరగని పోరాటం..

హు జిన్యావో కేవలం 23 ఏళ్ల వయసులోనే 'ANCA-అసోసియేటెడ్ వాస్కులైటిస్' అనే అరుదైన రక్తనాళాల వ్యాధితో పోరాడుతోంది. ఆ రోజు ఇంజెక్షన్ చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్తుండగా, ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా ఆమెకు రక్తపు వాంతులు అయ్యాయి. 2018 నుంచే ఈ వ్యాధితో బాధపడుతున్న ఆమె, పేదరికం కారణంగా చదువు మానేసి రోడ్డు పక్కన ఆరెంజ్ జ్యూస్ అమ్మింది. ప్రస్తుతం ఆన్‌లైన్ నవలలు రాస్తూ తన వైద్య ఖర్చుల కోసం నెలకు 5,000 యువాన్లు సంపాదిస్తోంది. గతేడాది ఆమెకు ఆసుపత్రి నుంచి ఏకంగా 20 సార్లు డెత్ నోటీసులు (తీవ్ర అనారోగ్య హెచ్చరికలు) అందాయంటే ఆమె పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రేమించిన వాడు వెళ్తూ ఇచ్చిన 'కానుక'..

జిన్యావో జీవితంలో మరో విషాదకరమైన మలుపు ఆమె ప్రేమకథ. గతేడాది ఆమె ప్రియుడు జియావో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్‌తో మరణించాడు. తన ఆరోగ్యం బాగోలేదని, తన వల్ల అతను ఇబ్బంది పడకూడదని జిన్యావో అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కానీ, అతను చనిపోయే ముందు తన వద్ద ఉన్న 50,000 యువాన్ల పొదుపు మొత్తాన్ని జిన్యావో చికిత్స కోసమే వదిలివెళ్లాడు. వీరిద్దరి నిస్వార్థ ప్రేమకథ చైనా సోషల్ మీడియాలో నెటిజన్లను కదిలించివేసింది.

వెల్లువెత్తిన విరాళాలు.. వేల మంది కృతజ్ఞతలు..

మెట్రో వీడియో వైరల్ అయిన వారం రోజుల్లోనే జిన్యావో ఖాతాలోకి ఏకంగా 4,00,000 యువాన్లు (సుమారు ₹3.74 కోట్లు) విరాళాలు వచ్చాయి. విరాళాలు ఎంతలా వచ్చాయంటే, బ్యాంకు ఆమె ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. "నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరి పేరు, వారు ఇచ్చిన మొత్తాన్ని నేను డైరీలో రాసుకున్నాను. భవిష్యత్తులో వారికి కష్టం వస్తే నేను కూడా తోడుంటాను" అని ఆమె కృతజ్ఞతాపూర్వకంగా తెలిపింది. "పోరాడుతూనే ఉండు జిన్యావో.. మేమున్నాం" అంటూ వేలాది మంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+