ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఐసీసీ అరెస్ట్ వారెంట్
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC) అరెస్ట్ వారెంటు జారీ చేసింది. ఆయనతోపాటు మాజీ రక్షణ శాఖ మంత్రి యోఆవ్ గల్లాంపైనా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక చర్యల ఆరోపణలతో ఈ ఇద్దరిపై ఐసీసీ గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతోపాటు మాజీ మంత్రి గల్లాంట్ గాజాలో హత్యలు, హింస, అమానవీయ చర్యలతోపాటు ఆకలిచావుల వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపించింది. అక్కడి పౌరులకు ఆహారం, నీరు, ఔషధాల సరఫరాపై ఆంక్షలు విధించారని.. దీంతో మానవ సంక్షోభం తీవ్రమవ్వడం వల్ల మరణాలకు దారి తీసిందని తెలిపింది.

ఎంతో మంది చిన్నారులు బాధితులుగా మారారని, అక్కడి పౌరులను లక్ష్యంగా చేసుకున్నారనేందుకు తగినన్ని ఆధారాలు గుర్తించామని ఐసీసీ తెలిపింది. అయితే, తనపై ఐసీసీ అరెస్టు వారెంటు జారీ చేయడాన్ని నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. అవి అసంబద్ధమైన, తప్పుడు చర్యలని, వాటిని తిరస్కరిస్తున్నట్లు తేల్చి చెప్పారు. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది తప్ప మరేమీ లేదని నెతన్యాహు స్పష్టం చేశారు.
ICC యొక్క ప్రకటన ప్రకారం, అరెస్ట్ వారెంట్లు అక్టోబర్ 8, 2023 నుండి మే 20, 2024 వరకు చేసిన చర్యలకు సంబంధించినవి. నెతన్యాహు మరియు గాలంట్ ఇద్దరూ సహ-నేరస్థులుగా నేరపూరితంగా బాధ్యులని అనుమానించడానికి కోర్టు "సహేతుకమైన కారణాలను" కనుగొంది. వారు ఆకలిని యుద్ధ పద్ధతిగా ఉపయోగించారని మరియు మానవత్వానికి వ్యతిరేకంగా హత్యలు, హింసలు మరియు ఇతర అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇది ఇలావుండగా, పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో గాజా స్ట్రిప్‌లో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 44 వేలు దాటినట్లు గాజా ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. లక్షా 4 వేల మంది గాయపడినట్లు తెలిపింది. మృతి చెందిన వారిలో సగం మందికిపైగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు, ఇప్పటివరకు 17 వేల మంది హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.
గతేడాది అక్టోబరులో ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి చేసి వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చడంతోపాటు పలువురిని బంధీలుగా చేసుకుంది. ఇప్పటికీ వారిని విడుదల చేయలేదు. దీంతో ఇజ్రాయెల్ ఆ దాడులకు ప్రతీకారంగా దాడులు చేస్తోంది. బందీలను విడిపించాలని కోరుతున్నా.. హమాస్ నుంచి స్పందన రాకపోవడంతో ఇజ్రాయెల్ మరింతగా భీకర దాడులకు పాల్పడుతోంది.












Click it and Unblock the Notifications