ఇరాన్ లో సంక్షోభం వేళ.. జైశంకర్ కు ఇరాన్ విదేశాంగ మంత్రి ఫోన్
ఇరాన్ ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. దీంతో నిరసనలు, ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకిపోతుంది. ఇరాన్ లో జరిగిన నిరసనల ద్వారా దాదాపు 12 వేల మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అంతేకాక మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచ్చి.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఫోన్ చేశారు. ఇరాన్ లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించారు. ఇదే విషయాన్ని జైశంకర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
" ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అర్గాచ్చీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మేము ఇరాన్ లో ప్రస్తుత పరిస్థితిపై చర్చలు నిర్వహించాం" అని జైశంకర్ పోస్టు పెట్టారు. మరోవైపు ఇరాన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఇరాన్ లో ఉంటున్న భారత పౌరులు దేశం విడిచి వెంటనే వెళ్లిపోవాలని సూచించింది.
గత కొన్ని రోజులుగా ఇరాన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడి భారత రాయబార కార్యాలయం అలెర్ట్ అయింది. ఇరాన్ లో ఉంటున్న భారత పౌరులు దేశం విడిచి వెంటనే వెళ్లిపోవాలని సూచనలు చేసింది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని పేర్కొంది.

ఇదే విషయంపై జమ్మూకశ్మీర్ స్టూడెంట్ అసోసియేషన్ కూడా స్పందించింది. ఇరాన్ లోని కశ్మీరీ స్టూడెంట్స్ ను తిరిగి వెనక్కు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ లకు విజ్ఞప్తి చేసింది. ఇరాన్ లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications