ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ హతం..!
ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులు ఇరాన్ కి భారీ షాక్ ఇచ్చాయి. ఈరోజు ( జూన్ 13, శుక్రవారం ) తెల్లవారుజామున టెహ్రాన్‌ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని బాంబుల దాడులు నిర్వహించింది. ఇరాన్ అణు స్థావరాలే టార్గెట్ గా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. వైమానిక దాడులను సాగిస్తూ.. మిస్సైళ్లతో విధ్వంసం సృష్టించడంతో ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్, ఇద్దరు శాస్త్రవేత్తలు సహా పలువురు కీలక అధికారులు మృతిచెందినట్లు సమాచారం.
ఈ దాడుల్లో న్యూక్లియర్ ప్లాంట్లు, సైనిక స్థావరాలే ప్రధాన లక్ష్యాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐదు విడతలుగా మిస్సైల్ దాడులు జరిగాయని అంటున్నారు. అయితే ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మృతి చెందినట్లు స్థానిక ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలు మాత్రం ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. దీంతో ఈ వ్యవహరం మరింత కలకలం సృష్టిస్తోంది.

బాఘేరి ప్రస్థానం..
మహమ్మద్ బాఘేరి టెహ్రాన్‌లో జన్మించి.. ఐఆర్‌జీసీలో 1980లో చేరారు. అలానే ఇరాన్-ఇరాక్ యుద్ధంలో సైతం పాల్గొన్నారు. 2016లో ఆయన్ను మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించారు. మిలిటరీ ఇంటెలిజెన్స్‌లో ప్రావీణ్యం కలిగిన ఆయన, పొలిటికల్ జియోగ్రఫీలో పీహెచ్‌డీ చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలో అమెరికా, కెనడా, యూకే, ఐరోపా యూనియన్ ఆయన్ను ఆంక్షలతో చేరవేశాయి. 2022-23లో మాషా అమిని మృతికి వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమాలను బలవంతంగా అణచివేయడంలో కూడా ఆయన కీలకపాత్ర వహించారు.
ప్రతీకారం తప్పదు - ఇరాన్
ఈ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ఇజ్రాయెల్ చర్యలకు తగిన ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. "గట్టి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అని ఖమేనీ హెచ్చరించారు.
Iran's chief of staff Mohammad Bagheri has been killed in a precision strike by Israel, say unconfirmed reports.
— Abhijit Majumder (@abhijitmajumder) June 13, 2025
His building was hit by a missile.
IRGC top brass under fire in Israel’s #OperationRisingLion.
Israel must finish the job, liberate Iranians from the ayatollah regime. pic.twitter.com/t3DR9cNEW0
నతాంజ్ అణుశుద్ధి కేంద్రం ధ్వంసం - ఐఏఈఏ
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రం తీవ్రంగా ధ్వంసమైందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ రాఫెల్ గ్రోసీ సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. "ఇరాన్‌లో నెలకొన్న తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. రేడియేషన్ లీకేజీ పరిస్థితిపై స్పష్టత కోసం ఇరాన్ అధికారులతో సంప్రదిస్తున్నాం. మా పరిశీలకులతో నిరంతరం టచ్‌లో ఉన్నాం," అని ఆయన వెల్లడించారు.
-
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ఇరాన్ కు కొత్త భద్రతా ఛీఫ్-లారిజానీ స్ధానంలో-ఎవరీ మహమ్మద్ జోల్ఘదర్? -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
హార్ముజ్ లో జాంబీ షిప్ ? ఐదేళ్ల క్రితం మాయమై.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష్యం..! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
1970ల నాటి చీకటి రోజులు మళ్లీ: సంచలన హెచ్చరిక!











Click it and Unblock the Notifications