ఇస్లామిక్ స్టేట్ సొంత బంగారు కరెన్సీ రెడి
సిరియా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు (ఐఎస్ఐఎస్) సొంతంగా కరెన్సీ నాణేలను ముద్రించి మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు. అగ్రరాజ్యాలు పెట్టుబడులతో ప్రపంచ దేశాలను బానిసలుగా మార్చేస్తున్నారని ఉగ్రవాదులు మండిపడుతున్నారు.
బంగారు దినార్, వెండి దిర్హామ్, ఇత్తడి నాణేలను ముద్రిస్తోంది. 4.25 బంగారు దినార్ కు ఒక వైపు మొక్క జోన్న, మరో వైపు ప్రపంచ పటం ముద్రించారు. ఒక బంగారు దినార్ విలువ 139 డాలర్లు అని ఇస్లామిక్ స్టేట్ తాజాగా విడుదల చేసిన వీడియోలో వెల్లడించింది.

ఇస్లామిక్ స్టేట్ సంస్థలోని ఉగ్రవాదులకు మాత్రం ఈ నాణేలు ఇస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల అవసరాలు తీర్చడానికి ఈ నాణేలు పంపిణి చేస్తున్నారు.
మానవ బాంబర్లు...............!
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు దాడులు చెయ్యడానికి 15 మానవ బాంబర్లను బయటకు పంపిచారని వెలుగు చూసింది. ఆ మానవ బాంబర్లు ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తారో తెలియదని స్థానిక మానవ హక్కుల సంఘం వెల్లడించింది.












Click it and Unblock the Notifications