19 మంది హిందువులను సిక్కులను చంపింది మేమే: ఐసిస్
తూర్పు ఆఫ్ఘానిస్తాన్‌లో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడికి బాధ్యులం తామేనంటూ ప్రకటించింది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్. అఫ్ఘానిస్తాన్ దేశాధ్యక్షుడు అష్రాఫ్ గనితో జలాలాబాద్‌లో సమావేశం అయ్యేందుకు ప్రయాణిస్తున్న మైనార్టీ వర్గాలకు చెందిన బృందంపై ఐసిస్ విరుచుకుపడింది. దీంతో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది సిక్కులు హిందువులు ఉన్నారు. అవతార్ సింగ్ ఖాల్సా అనే సిక్కు మతానికి చెందిన నాయకుడు ఈ దాడిలో మృతిచెందారు.
ఈ దాడికి పాల్పడింది తామే నంటూ ఐసిస్ ప్రకటన విడుదల చేసింది. తమ దేశంలో ముస్లింయేతర వ్యక్తులను టార్గెట్ చేశామంటూ ప్రకటనలో తెలిపారు. ముస్లిం దేశమైన అఫ్ఠానిస్తాన్‌లో సిక్కులు, హిందువులు తక్కువ శాతంలో నివసిస్తున్నారు. అయితే అక్కడ వారు పలు రకాలుగా అవమానాలకు గురవుతున్నారు. దీంతో ఐసిస్ వారిని టార్గెట్ చేయగా ఇప్పటికే చాలామంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 1970లో మైనార్టీలుగా ఉన్న సిక్కులు హిందువుల జనాభా ఆ దేశంలో 80 వేలు ఉండగా... నేటికి ఆ సంఖ్య వెయ్యికి చేరుకుంది. ఐసిస్ దాడిలో మృతి చెందిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు.

-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications