వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాషింగ్టన్ లో దాడులు చేస్తాం: ఇస్లామిక్ స్టేట్

|
Google Oneindia TeluguNews

కైరో: ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికాతో పాటు ఇతర దేశాల్లో తాము దాడులు చేసి తగిన బుద్ది చెబుతామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు హెచ్చరించారు. తమకు వ్యతిరేకంగా దాడులు చేస్తున్న అన్ని దేశాలకు ప్యారిస్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

సోమవారం ఇస్లామిక్ స్టేట్ ఉపయోగించే ఓ వెబ్ సైట్ లో ఓ వీడియో దర్శనం ఇచ్చింది. ఆ వీడియోలో తలపాగ పెట్టుకున్న ఓ వ్యక్తి తాను అల్జెరియన్ అల్ గరీబ్ అంటూ పరిచయం చేసుకున్నాడు. సిరియాలో తమ ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో అగ్రరాజ్యాలు వైమానిక దాడులు చేస్తున్నాయని ఆరోపించాడు.

అగ్రరాజ్యాలు జరుపుతున్న వైమానిక దాడులను క్రూసెడర్ క్యాంపెయిన్ గా అభివర్ణించాడు. అంతే కాకుండా క్రూసెడర్ క్యాంపెయిన్ చేస్తున్న దేశాలకు తాము త్వరలోనే దాడులు చేసి బుద్ది చెబుతామని హెచ్చరించాడు.

Islamic State warned in a new video on Monday

దేవుడి అనుగ్రహం ఉంది కనుకే తాము ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో దాడులు చేశామని, దేవుడు తమకు అన్ని విధాల సహకరిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అమెరికా కేంద్రబిందువైన వాషింగ్టన్ తో పాటు పలు దేశాల రాజధానులలో త్వరలోనే తాము ప్యారిస్ తరహా దాడులు చేస్తామని అతను హెచ్చరించాడు.

అయితే ఆ వీడియోను సోమవారం అప్ లోడ్ చేశారు. అతను మాట్లాడుతున్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని అమెరికా అధికారులు అంటున్నారు. అమెరికాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు చెయ్యకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.

English summary
Islamic State warned: Threatens attacks on Washington and other Countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X