Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్: భీకర దాడులు- భారీగా ప్రాణనష్టం

Israel: గాజాలో హమాస్, లెబనానన్ లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వస్తోన్న ఇజ్రాయెల్‌ మరోసారి కొరడా ఝుళిపించింది. గాజాపై భీకర దాడులు చేపట్టింది. ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 30 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడంతో ఇజ్రాయెల్- హమాస్ మధ్య శాంతి ఒప్పందాలు కుదిరిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా పరస్పరం తమ ఆధీనంలో ఉన్న ఆయా దేశాల బందీలు, ఖైదీలను విడిచిపెట్టారు కూడా. ఈ వ్యవహారం అంతా కొలిక్కి వచ్చిందనుకున్న దశలో ఇజ్రాయెల్ మళ్లీ దాడులు మొదలు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండా నేరుగా వైమానిక దాడులు చేపట్టింది.

Israel Launches Air Strikes in Gaza Amid Ongoing Ceasefire

తాజాగా ఎయిర్ స్ట్రైక్స్ లో 30 మంది మరణించినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ పేర్కొంది. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఈ దాడులు జరిగాయని, తమ బలగాలపై హమాస్ దాడి చేసిందని అటు ఇజ్రాయెల్ సైన్యం కూడా ఆరోపించింది. అల్‌-షిఫా ఆసుపత్రి ప్రాంగణంపైనా మిస్సైళ్లు సంధించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గాజా వ్యాప్తంగా ఈ దాడులు జరిగాయని హమాస్ కు చెందిన రెస్క్యూ ఫోర్స్ ప్రతినిధి తెలిపారు. ఓ వాహనంపై మిస్సైల్ పడి అయిదుమంది సాధారణ పౌరులు మరణించారు.

గాజాపై తీవ్ర దాడులు చేయాలని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశించిన రెండు గంటల్లో డ్రోన్లతో తేలికపాటి మిస్సైళ్లను సంధించింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్. తమ ఆర్మీ క్యాంప్ లపై హమాస్ దాడి చేయడం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. హమాస్ ప్రమాదకరంగా వ్యవహరించిందని, ఐడీఎఫ్ శిబిరాలపై దాడికి పాల్పడిందని కాట్జ్ ఓప్రకటనలో తెలిపారు. బలగాలపై ఎక్కడ దాడి జరిగిందో కాట్జ్ ఇందులో వివరించనప్పటికీ.. రఫాలో జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో తమకు సంబంధం లేదని హమాస్ ప్రకటించింది. ఇజ్రాయెల్ వాదనతో తాము ఏకీభవించట్లేదని స్పష్టం చేసింది. తాము గానీ, తమ అనుబంధ సంస్థలేవీ కూడా ఐడీఎఫ్ క్యాంపులపై దాడులు జరిపినట్లు సమాచారం లేదని హమాస్ అధికార ప్రతినిధి తెలిపారు. కాల్పుల విరమణ అమలులో ఉన్న ఈ దశలో ఇజ్రాయెల్ దాన్ని ఉల్లంఘించడం సరికాదని అన్నారు. 30 మందికి పైగా సాధారణ పౌరులు మరణించారని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ తాజా దాడులపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఐడీఎఫ్ క్యాంప్ పై దాడి జరిగిన విషయాన్ని ధృవీకరించారు. ఇది ఎవరు చేశారనేది స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. హమాస్ లేదా గాజాకు చెందిన మరో మిలిటెంట్ గ్రూప్ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాలు అమలులోనే ఉన్నాయని చెప్పారు. దీన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘించే అవకాశాలు లేవని తేల్చి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+