ఆపరేషన్ రైజింగ్ లయన్.. ఇజ్రాయెల్ అధినేత షాకింగ్ కామెంట్స్ !

ఇరాన్ పై ఊహించని రీతిలో ఇజ్రాయెల్ మెరుపు దాడులకు దిగడం యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇరాన్‌లోని కెర్మాన్‌షా, లోరెస్థాన్‌, టెహ్రాన్ ప్రాంతాల్లో ఈ దాడులు జరగగా.. అణు స్థావరాలే టార్గెట్ గా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్‌ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్, ఇద్దరు శాస్త్రవేత్తలు సహా పలువురు కీలక అధికారులు మృతిచెందినట్లు సమాచారం. కాగా దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఆపరేషన్ రైజింగ్ లయన్..

ఇరాన్ పై " ఆపరేషన్ రైజింగ్ లయన్" ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా వీడియోను రిలీజ్ చేశారు. టెహ్రాన్ యొక్క బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిపామని చెప్పారు. ఈ దాడి ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమే అని అభివర్ణించారు. సరైన సమయంలో ఇజ్రాయెల్ పై ముప్పును తగ్గించేందుకు చేపట్టిన చర్యగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పై ముప్పును పూర్తిగా తొలగించడానికి అవసరమైనన్ని రోజులు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు.

israel-pm-nethanyahu-comments-on-operation-rising-lion

అంతే కాకుండా ఇరాన్ అణుశక్తి కేంద్రాలను టార్గెట్ గా చేసుకున్నామని.. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమాన్ని కూడా ఉద్దేశించి దాడులు నిర్వహించామని ప్రధాని స్పష్టం చేశారు. అణుబాంబు రూపకల్పనలో పనిచేస్తున్న ఇరాన్ అణు శాస్త్రవేత్తలపై కూడా దాడి చేసామని నెతన్యాహు చెప్పారు. దశాబ్దాలుగా టెహ్రాన్‌లోని నియంతలు బహిరంగంగానే కాకుండా.. ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలంటూ పిలుపునిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ ఇప్పటివరకు తొమ్మిది అణుబాంబులకు సరిపడే అత్యంత శుద్ధి చేసిన యురేనియంను ఉత్పత్తి చేసిందని.. అది తక్కువ సమయంలోనే అణు ఆయుధాన్ని తయారుచేసే స్థాయికి చేరుకుందని నెతన్యాహు ఆరోపించారు. ఇది ఇజ్రాయెల్ అస్తిత్వానికి సూటిగా ముప్పుగా నిలుస్తుందని తెలిపారు. ఎనభై ఏళ్ల క్రితం, నాజీ పాలకుల చేతిలో యూదులు హలోకాస్ట్‌కు గురయ్యారని తన ప్రసంగంలో నెతన్యాహు గుర్తు చేశారు.

మరోవైపు ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధపడుతోందని సమాచారం. ఏ క్షణంలోనైనా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు చేసే స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమయ్యి దేశమంతా ఎమర్జెన్సీ ప్రకటించింది. పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ రక్షణ శాఖ హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+