గాజాలో హాస్పిటల్ ను పేల్చేసిన ఇజ్రాయిల్.. వీడియో వైరల్

గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ భీకర దాడులను ఉద్ధృతం చేసింది. తాజాగా గాజాలోని ఆస్పత్రిపై భారీ వైమానిక దాడి చేపట్టింది. ఈ దాడిలో నలుగురు జర్నలిస్టులతో పాటు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వివరాలను గాజాలోని హెల్త్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఓ వైపు కాల్పుల విరమణకు చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు గాజాలో వైమానిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరోవైపు గత వారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం తొలి అడుగులు వేసినట్లు చెప్పుకొచ్చారు.

ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా ప్రాంతం అట్టుడుకిపోతోంది. తాజాగా దక్షిణ గాజాలోని నసేర్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రి భవనంపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు జరిపింది. ఈ దాడుల్లో నలుగురు జర్నలిస్టులతోపాటు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు దక్షిణ గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. మృతుల్లో అల్ జజీరా, రాయిటర్స్ కు చెందిన జర్నలిస్టులు ఉన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. ఇక తాజా దాడిలో ఆస్పత్రి భవనం వద్ద పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Israeli Airstrike on Gaza Hospital Kills 15 Including Four Journalists

ఇజ్రాయెల్ సైన్యం గత 22 నెలలుగా నసేర్ ఆస్పత్రిపై దాడులు చేస్తూనే ఉంది. ఈ ఆస్పత్రిలో హమాస్ మిలిటెంట్స్ ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది. తాము హమాస్ ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. నసేర్ ఆస్పత్రిలో హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వాదిస్తోంది. వాటినే తాము టార్గెట్ చేసినట్లు స్పష్టం చేసింది. జూన్ లోనూ ఇదే ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందగా 10 మందికిపైగా గాయపడ్డారు.

ఇక గాజా ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం మొదలైనప్పటి నుంచి 62, 686 మంది పాలస్తీనియులు మృతి చెందారు. వీరిలో సగానికి పైగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. అయితే ఈ వివరాలను ఇజ్రాయెల్ కొట్టిపారేసింది. ఇక ఇజ్రాయెల్ సైన్యం గాజాను స్వాధీనం చేసుకోవడాన్ని అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని ఫ్రాన్స్, బ్రిటన్‌ సహా పలు దేశాలు తీర్మానించాయి. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామంటూ ప్రకటన చేశాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా ఇజ్రాయెల్ నిర్ణయాన్ని తప్పుపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+