టీవీ బిల్డింగ్ పై బాంబుల వర్షం.. భయంతో పరిగెత్తిన న్యూస్ రీడర్.. వీడియో వైరల్

సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. సిరియా రాజధాని డమాస్కస్‌ లోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి మరువకముందే మరోసారి డమాస్కస్ లోని పలు అధికారిక భవనాలు, న్యూస్ ఛానెల్ బిల్డింగ్స్ పై దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. తాజాగా డమాస్కస్ లోని ప్రభుత్వ టీవీ బిల్డింగ్ లక్ష్యంగా బాంబు దాడులు చేసింది. ఈ దాడులతో భయపడిన ఓ టీవీ యాంకర్ లైవ్ లో న్యూస్ చదవడం ఆపేసి బయటకు పరుగులు తీసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Israeli Army Bombs Syrian TV Building in Damascus Newsreader Flees in Viral Video

సిరియా రాజధాని డమాస్కస్ పై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడుల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా రాజధానిలోని ప్రభుత్వ టీవీ బిల్డింగ్ కార్యాలయం లక్ష్యంగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. ఈ దాడులు లైవ్ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దాడులతో భయపడిన ఓ టీవీ యాంకర్ లైవ్ లో న్యూస్ చదవడం ఆపేసి బయటకు పరుగులు తీసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

సిరియాలోని సువీడా ప్రాంతంలో మైనారిటీ వర్గం అయిన డ్రూజ్ తెగ ప్రజలకు, సైన్యానికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో వీరి మధ్యలోకి ఇజ్రాయెల్ ప్రవేశించింది. డ్రూజ్ వర్గం ప్రజలకు మద్దతుగా సిరియా ప్రభుత్వం పై దాడులు చేస్తోంది. ఇదే విషయంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ మంత్రి ఖట్జ్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ సైన్యానికి ఇచ్చిన వార్నింగ్ ముగిసింది.. ఇక దాడులను తట్టుకోండి అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ సైన్యం సిరియాపై దాడులు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ లోని డ్రూజ్ తెగ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సిరియాలోని డ్రూజ్ తెగ ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం రక్షిస్తుందని హామీ ఇచ్చారు ఖట్జ్.

ఈ నేపథ్యంలోనే సిరియాలోని ప్రభుత్వ భవనాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. జులై 15 న బుధవారం రోజు సిరియా రాజధాని డమాస్కస్‌ లోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసింది. తాజాగా రాజధాని డమాస్కస్ లోని ప్రభుత్వ టీవీ బిల్డింగ్ కార్యాలయం లక్ష్యంగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. ఈ దాడులు లైవ్ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దాడులతో భయపడిన ఓ టీవీ యాంకర్ లైవ్ లో న్యూస్ చదవడం ఆపేసి బయటకు పరుగులు తీసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+