నైట్ క్లబ్‌లో కాల్పులు, 39 మంది మృతి: మాజీ ఎంపీ కొడుకు సహా ఇద్దరు ఇండియన్స్ కూడా
టర్కీలోని ఇస్తాంబుల్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్‍లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 39 మంది దాకా మృతి చెందారు.
ఇస్తాంబుల్: టర్కీలోని ఇస్తాంబుల్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్‍లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 39 మంది దాకా మృతి చెందారు. మరో నలభై మంది గాయపడ్డారు.
అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో (స్థానిక కాలమానం) ఓర్టాకో ప్రాంతంలో ఉన్న రెయినా నైట్ క్లబ్ పైన ఈ దాడి జరిగింది.

దాడి జరిగినప్పుడు నైట్ క్లబ్‌లో వందలాది మంది ఉన్నారు. ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు కొందరు పక్కనే ఉన్న బోస్పోరస్‌లోకి దూకారు. ఇది తీవ్రవాద దాడిగా ప్రాథమికంగా నిర్ధారించారు. గత ఏడాది కాలంగా ఇస్లామిక్ స్టేట్‌గా ఇస్తాంబుల్ నగరం లక్ష్యంగా ఉంది.
చనిపోయిన వారిలో ఇద్దరు భారతీయులు
కాల్పులు జరిపిన దుండగులు శాంటా క్లాజా దుస్తులు ధరించి వచ్చి ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన 39 మందిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మృతి చెందిన ఆ భారతీయులు అబిస్ రిజ్వి, ఖుషీ షాలు ఉన్నారు. అబిసి రిజ్వి మాజీ రాజ్యసభ సభ్యుడి తనయుడు. ఇక, ఖుషీ షా గుజరాత్‌కు చెందిన వ్యక్తి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications