మరో ఘోరం.. బోయింగ్ విమానంలో సమస్య.. 36 వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి..
తరచూ విమాన ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతిచెందారు. ఇటీవలి కాలంలో అనేక విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి జరిగింది.
జపాన్ కు చెందిన ఎయిల్ లైన్స్ విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగా 36 వేల అడుగుల ఎత్తు నుంచి 26 వేల అడుగుల ఎత్తుకు పడిపోయింది. షాంగై నుంచి టోక్యో వెళ్తున్న బోయింగ్ 737 విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం ఒక్కసారిగా కిందకి దూసుకొస్తున్న సమయంలో ప్రయాణికులు భయబ్రాంతులకు లోనయ్యారు. విమానం కుప్పకూలుతోందన్న భయంతో ఆక్సిజన్ మాస్కులు ధరించారు. మరికొంత మంది ఇదే చివరి క్షణాలుగా భావించి తమ బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ఫేర్ వెల్ నోట్స్ పంపారు.
జపాన్ ఎయిర్ లైన్స్ అయిన స్ప్రింగ్ జపాన్ కు చెందిన బోయింగ్ 737 విమానం జూన్ 30న షాంగై లోని పుదాంగ్ ఎయిర్ పోర్ట్ నుంచి 191 మంది ప్రయాణికులతో టోక్యోకు బయల్దేరింది. విమానం ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం 36 వేల అడుగుల ఎత్తు నుంచి 26 వేల అడుగుల ఎత్తుకు పడిపోయింది. 10 నిమిషాల్లో 10,500 అడుగులు కిందకు దూసుకొచ్చింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ఒశాకాకు మళ్లించాడు. ఆ తర్వాత విమానాన్ని సేఫ్ గా ల్యాండింగ్ చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

అయితే విమానం కిందకు దూసుకొస్తున్న సమయంలో అందులోని ప్రయాణికులు భయబ్రాంతులకు లోనయ్యారు. విమానం కుప్పకూలుతోందన్న భయంతో ఆక్సిజన్ మాస్కులు ధరించారు. మరికొంత మంది ఇదే చివరి క్షణాలుగా భావించి తమ బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ఫేర్ వెల్ నోట్స్ పంపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అయితే ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని జపాన్ అధికార ప్రతినిధులు తెలిపారు.












Click it and Unblock the Notifications