అనుమానం!: భార్య కాళ్లు, చేతులు నరికిన భర్త ఆత్మహత్య
కౌలాలంపూర్: మలేషియాలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లల భార్య కాళ్లు, చేతులు నరికేశాడు భర్త. అనంతరం అతను ఉరివేసుకున్నాడు. బాధిత మహిళ వయస్సు 44 ఏళ్లు. ఆమె మలేషియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందింది.
ఆ విషాద సంఘటన గురువారం జరిగింది. వెంటనే ఆమెను సదర్న్ స్టేట్ జోహార్‌లోని క్లౌంగులోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి స్టాఫ్ నర్స్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. ఆమెను ఆదివారం ఇంటెన్సివ్ కేర్ నుండి డిశ్చార్జ్ చేశామని, జనరల్ వార్డుకు తరలించామని చెప్పారు.
47 ఏళ్ల భర్తకు ఉద్యోగం లేదు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం భార్య కాళ్లు, చేతులు నరికేశాడు. అనంతరం తాను ఉరివేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. కాగా, బాధిత మహిళ సింగపూర్‌లో పదిహేనేల్లుగా డిష్ వాషర్‌లో పని చేస్తోందని తెలుస్తోంది.

వారి కుటుంబం ఈ మహిళ సంపాదించే జీతం పైనే ఆధారపడేవారని స్థానికులు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. భర్తకు ఉద్యోగం లేనందున ఆమె సంపాదన పైనే ఉండేవారన్నారు. ఈమె నెలకు ఓసారి మాత్రమే ఇంటికి వచ్చేది. తన పిల్లలను, అత్తను చూసేందుకు వచ్చేది.
అయితే, ఆమె ఇంటికి వచ్చిన ప్రతిసారి భర్త బాధిత మహిళతో గొడవపడేవాడని చెబుతున్నారు. ఈ మహిళకు ఎవరితోనో సంబంధం ఉందని అనుమానించేవాడని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా, పిల్లల్ని బంధువుల వద్ద ఉంచారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications