గ్లోబల్ సిఈఓల పే చార్ట్: రూ. 525కోట్లతో సత్య నాదెళ్ల టాప్
న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత ఎక్కువ జీతాలు అందుకుంటున్న వారిలో మన తెలుగువాడు అగ్రస్థానాన్ని సాధించి రికార్డు సృష్టించారు. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేతగా ఉన్న సత్య నాదెళ్ల ఈ రికార్డును సాధించారు. అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల్లో అత్యధిక వేతనం అందుకుంటున్న జాబితాలో భారత సంతతికి చెందిన నాదెళ్లకు మొదటి స్థానం లభించింది.
సంవత్సరానికి సత్య నాదెళ్ల అందుకుంటున్న జీతం 84.3 మిలియన్ డాలర్లు. ఇది మన కరెన్సీలో రూ.525 కోట్లకు పైమాటే. అంతర్జాతీయంగా 100 కంపెనీల్లో పనిచేస్తున్న సీఈవోలు అందుకుంటున్న వేతనాలపై ఒక నివేదిక విడుదలైంది.

నిరుడు తొలి స్థానంలో నిలిచిన ఒరాకిల్ చీఫ్ లారీ ఎల్లిసన్, ప్రస్తుత సంవత్సరానికి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. భారత సంతతికి చెందిన మరోవ్యక్తి పెప్సికో సీఈవో ఇంద్రా నూయికి 19.08 మిలియన్ డాలర్లతో 19వ స్థానం దక్కింది. కాగా, ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ టాప్-100లో చివరి స్థానం లభించింది.
క్వాల్‌కామ్‌కు చెందిన సీవెన్ మోలెన్‌కాప్ 67.3 మిలియన్ డాలర్ల పే ప్యాకేజీతో మూడో స్థానంలో నిలిచారు. స్టీవ్ మోలెన్‌కోఫ్(60.7 మిలియన్ డాలర్లు) ఆ తర్వాతి స్థానం లభించింది. టాప్-10 జాబితాలో రోబర్ట్ ఐగర్(వాల్ట్ డిస్నీ), ల్యారీ మెర్లో(సీవీఎస్ హెల్త్), కే రూపర్ట్ ముర్దోచ్(21 సెంచూరి ఫాక్స్), డబ్లూ జేమ్స్ జూనియర్(బోయింగ్), జేమ్స్ గోర్మన్(మోర్గాన్ స్టాన్లీ), డేవిడ్ కోట్(హనీవెల్ ఇంటర్నేషనల్), కెన్నెత్ చెనాల్ట్(అమెరికన్ ఎక్స్‌ప్రెస్)లకు చోటు లభించింది.












Click it and Unblock the Notifications